More

    ఉక్రెయిన్ లోని ఆ నాలుగు ప్రాంతాలు కలిపేసుకుంటున్నాం: రష్యా

    ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోడానికి రష్యా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను తాము కలిపేసుకుంటామని రష్యా గురువారం ప్రకటించింది. దక్షిణ, తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతాలైన జపొరిఝియాలో 93%, ఖేర్సన్‌లో 87%, లుహాన్‌స్క్‌లో 98%, డొనెట్‌స్క్‌లో 99% మంది రష్యాకు అనుకూలంగా ఓటేశారని క్రెమ్లిన్‌ ప్రకటించింది. శుక్రవారం క్రెమ్లిన్‌ కోటలోని సెయింట్‌ జార్జి హాల్‌లో జరిగే కార్యక్రమంలో విలీనం విషయాన్ని అధ్యక్షుడు పుతిన్‌ స్వయంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రష్యా చేపట్టిన రెఫరెండంను, విలీనం చేసుకోవడాన్ని గుర్తించబోమని.. ఈ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్‌ దళాలు అంటున్నాయి.

    Trending Stories

    Related Stories