పుతిన్‎పై హత్యాయత్నం.. ఉక్రెయిన్ డిఫెన్స్ చీఫ్ వెల్లడి

0
705

ఉక్రెయిన్ పై రష్యా సేనలు దాడులు చేస్తున్న నేపథ్యంలో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఉక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ కిరిలో బుద‌నోవ్ ఈ విష‌యాన్ని తెలిపారు.

పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ కొత్త విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. న‌ల్ల స‌ముద్రం, క్యాస్పియ‌న్ స‌ముద్రం మ‌ధ్య ఉన్న కౌక‌స‌స్ ప్రాంతంలో పుతిన్‌పై హ‌త్యాయ‌త్న ప్ర‌య‌త్నం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. రెండు నెల‌ల క్రితం ఈ ప్ర‌య‌త్నం జ‌రిగిన‌ట్లు భావిస్తున్నారు. ఉక్రెయిన్ మీడియాతో బుద‌నోవ్ ఈ విష‌యాన్ని తెలిపారు. పుతిన్‌పై హ‌త్యాయ‌త్న ప్ర‌య‌త్నం జ‌రిగిందని, కౌక‌స‌స్‌కు చెందిన ప్ర‌తినిధులు అత‌నిపై దాడి చేశార‌ని, ఆ దాడి ఈ మ‌ధ్య‌లోనే జ‌రిగిన‌ట్లు బుద‌నోవ్ వెల్ల‌డించారు.

హ‌త్యాయ‌త్నం విఫ‌లమైంద‌ని, కానీ క‌చ్చితంగా ఆ దాడి జ‌రిగింద‌ని, రెండు నెల‌ల క్రితం ఆ దాడి జ‌రిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు. మ‌రోవైపు పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల ఆయ‌న స‌ర్జ‌రీ చేయించుకున్న‌ట్లు కొన్ని రిపోర్ట్‌ల ద్వారా తెలుస్తోంది. పుతిన్ ఆరోగ్యం చాలా క్షీణించింద‌ని, ఆయ‌న‌కు బ్ల‌డ్ క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు ఓ ర‌ష్యా సంప‌న్నుడు వెల్ల‌డించారు. త‌న‌పై అయిదు సార్లు హ‌త్యాయ‌త్న ప్ర‌య‌త్నం జ‌రిగిన‌ట్లు 2017లో పుతిన్ చెప్పారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here