National

ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి ఆయనే..!

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి తీరథ్ సింగ్ రావత్ రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రి పదవి ఎంపిక కోసం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. పుష్కర్ సింగ్ ధామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారంటూ ఈ సమావేశంలో నిర్ణయించారు. సత్పాల్ మహారాజ్, ధన్ సింగ్ రావత్ లకు కూడా అర్హత ఉందని వాదనలు వినిపించినప్పటికీ.. ఖతిమా నియోజకవర్గ ఎమ్మెల్యే పుష్కర్ సింగ్ ధామినే ముఖ్యమంత్రిగా ఎన్నకున్నారు. ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేలు డెహ్రాడూన్ లో సమావేశమయ్యారు. డెహ్రాడూన్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో 57 ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమైన తరువాత కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సన్నిహితంగా భావించే ధామిని రాష్ట్ర తదుపరి సిఎంగా ప్రకటించారు. 45 ఏళ్ల ఈయన రెండుసార్లు ఎమ్మెల్యేగా నిలిచారు. ఖతిమా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

నూతన సీఎంగా అవకాశం దక్కించుకున్న పుష్కర్ సింగ్ మరికొన్నిరోజుల్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. పుష్కర్ సింగ్ ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు అత్యంత సన్నిహితుడిగా భావిస్తారు. 45 ఏళ్ల పుష్కర్ సింగ్ న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. బీజేపీ రాష్ట్ర జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి అయ్యారు. సంక్షోభ సమయంలో తనను సీఎంగా ఎన్నుకోవడం పట్ల పుష్కర్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి, పార్టీ పెద్దలు జేపీ నడ్డా, అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం పదవి ఓ సవాల్ వంటిదేనని, అయితే పార్టీ అండతో దీన్ని అధిగమిస్తానని పేర్కొన్నారు.

గత మార్చిలో త్రివేంద్ర సింగ్ రావత్ సీఎం పదవి నుంచి తప్పుకోగా, తీరథ్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. ఆయన ఎంపీగా ఉండడంతో, ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి నెగ్గడం అనివార్యమైంది. కానీ, ఇప్పటి పరిస్థితుల్లో ఎన్నికలు జరపడం కష్టసాధ్యం. దాంతో సీఎంగా పుష్కర్ సింగ్ ను ఖరారు చేశారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. నాలుగు నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తీరథ్ సింగ్ ఆరు నెలల లోపు శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. సెప్టెంబరు 10వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తవుతుంది. రాష్ట్రంలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ కరోనా నేపథ్యంలో ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. గడువు ముగిసే వరకు పదవిలో కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తీరథ్ సింగ్ రావత్ శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో గవర్నర్ దగ్గరకు చేరుకుని రాజీనామా పత్రాలను సమర్పించారు. ఖాళీగా ఉన్న రెండు స్థానాలు – హల్ద్వానీ మరియు గంగోత్రాలలో ఉప ఎన్నికలను ఎన్నికల కమిషన్ ప్రకటించడంపై స్పష్టత లేకపోవడంతో ఆయన రాజీనామా చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 − 19 =

Back to top button