More

    పక్కాగా ప్రధానికి హాని తలపెట్టే ప్లానింగ్.. పోలీసులే నిరసనకారులతో కలిసి ఛాయ్ తాగుతుంటే

    పంజాబ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ కాన్వాయ్ ని కావాలనే అడ్డుకున్నారా అనే అనుమానం వస్తోంది. ప్రధాని సెక్యూరిటీ విషయంలో అజాగ్రత్త కనబరిచిన పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దాదాపు 20 నిమిషాల పాటు ప్రధాని మోదీ కాన్వాయ్ ఫ్లైఓవర్ పై ఆగిపోయింది. ఈ భద్రతా వైఫల్యానికి సంబంధించి పంజాబ్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు తామే కారణమని భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించుకుంది. ప్రధానికి నిరసనను తెలిపేందుకు పియారియానా గ్రామ సమీపంలోని ఫ్లైఓవర్ వద్దకు వచ్చామని తెలిపింది. ఏడు కిసాన్ యూనియన్లు డిసెంబర్ 31న భేటీ అయ్యారు.

    ప్రధాని మోదీ భద్రతా ఉల్లంఘనకు సంబంధించి వీడియోలు వైరల్ అయ్యాయి. ఇందులో పంజాబ్ పోలీసులు నిరసనకారులతో కలిసి టీ ఆస్వాదిస్తున్నారు. దిగ్భ్రాంతికరమైన వాస్తవం ఏమిటంటే, కాన్వాయ్‌కు సురక్షితమైన మార్గాలను చూపించాల్సిన స్థానిక పోలీసులు రోడ్డును అడ్డుకున్న నిరసనకారులతో టీ పార్టీలో బిజీగా ఉన్నారు. బహుశా ప్రధానమంత్రికి హాని కలిగించాలనే దురుద్దేశంతోనే వారు ఇలా చేసి ఉంటారని అంటున్నారు.

    పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని హుస్సేనివాలాలో జాతీయ అమరవీరుల స్మారక స్థూపాన్ని సందర్శించడానికి ప్రధాని వెళుతున్నప్పుడు పంజాబ్‌లో ఈప్రమాదకరమైన పరిణామం జరిగింది. ఆయన కాన్వాయ్ వెళ్లాల్సిన రోడ్లు బ్లాక్ చేయబడ్డాయి. కాన్వాయ్‌లోని వాహనాలు ఫ్లై ఓవర్‌పై నిలిచిపోయాయి. VVIP మూవ్‌మెంట్ ప్రోటోకాల్ ప్రకారం, రహదారి మార్గాన్ని SPG, పంజాబ్ పోలీసులు ముందుగానే ప్లాన్ చేసారు. ప్రధానమంత్రి రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నారని సమాచారం అందించిన తర్వాత పంజాబ్ పోలీసులు ఆ మార్గాన్ని పరిరక్షించాల్సి ఉంది. కాన్వాయ్‌కు వెళ్లే రహదారులను దిగ్బంధించినప్పుడు, పోలీసులు నిరసనకారులతో టీ పార్టీలో బిజీగా కనిపించారు. రోడ్డు మార్గంలో ప్రయాణానికి సంబంధించి.. పంజాబ్ పోలీసులు కాన్వాయ్‌ ని సురక్షితంగా వెళ్లేలా చూడాల్సి ఉంది. బదులుగా వారు ఆందోళన చేస్తున్న రైతులు ఇచ్చిన వేడి టీ తాగారు. కాన్వాయ్ ఇరుక్కుపోయిన ఫ్లైఓవర్ నుండి ఈ టీ పార్టీ స్థలం చాలా దూరంలో లేదు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఇలా ప్రధానిని ఇబ్బంది పెట్టి ఉండొచ్చని పలువురు బీజేపీ నేతలు ఆరోపించారు.

    https://twitter.com/MeghBulletin/status/1478714880177831939

    Trending Stories

    Related Stories