More

    వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముతున్న పంజాబ్ ప్రభుత్వం

    పంజాబ్ ప్రభుత్వం వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్మాలని తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి తీసుకున్న ‘కోవ్యాక్సిన్’ వ్యాక్సిన్లను రాష్ట్రంలోని ప్రముఖ ఆసుపత్రులకు అమ్మి లాభాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఒక్కో డోస్ మీద పంజాబ్ ప్రభుత్వం 660 రూపాయల లాభాన్ని పొందనుంది. దీనికి ప్రైవేట్ ఆసుపత్రులు మరో 500 రూపాయలు అదనంగా ఉంచి.. ఒక్కో వ్యాక్సిన్ డోస్ కు 1560 రూపాయలు ప్రజల నుండి లాగనున్నారు. ఈ ప్రోగ్రామ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే పేరును పెట్టింది. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే 20000 డోసులను రాష్ట్రం లోని ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముకుంది. భారత్ బయోటెక్ 400 రూపాయలు ఒక్కో వ్యాక్సిన్ డోస్ కు తీసుకుంటూ ఉండగా.. పంజాబ్ ప్రభుత్వం సరికొత్త మార్కెట్ స్ట్రాటజీని అవలంభిస్తోంది.

    ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా భారత్ బయో టెక్ వ్యాక్సిన్లను సరఫరా చేయనుంది. అయితే ప్రైవేట్ ఆసుపత్రులకు వ్యాక్సిన్ ధరను 1200 రూపాయలుగా నిర్ణయించారు. కానీ పంజాబ్ ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు 1060 రూపాయలకే అమ్ముతోంది. దీంతో భారత్ బయోటెక్ దగ్గర కొనుక్కోవడం కంటే పంజాబ్ ప్రభుత్వం వద్ద కొనుక్కుంటే 140 రూపాయలు మిగులుతుంది కదా అనే కక్కుర్తి కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కనిపిస్తోంది. అందుకే ప్రభుత్వం నుండి కొనుగోలు చేశాయి.

    18-44 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్లకు ప్రైవేట్ ఆసుపత్రులు ఈ వ్యాక్సిన్లను ప్రస్తుతానికి అందిస్తూ ఉన్నాయి. ఒక్కో డోస్ కు 1560 రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రులు తీసుకుంటూ ఉన్నాయి. ఇలా చేయడం వలన ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడుతూ ఉంది. సాధారణ ప్రజలు వ్యాక్సిన్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉండగా.. పంజాబ్ ప్రభుత్వం మాత్రం ఏకంగా ప్రైవేట్ ఆసుపత్రులకు లాభానికి అమ్ముకుంటూ ఉంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నా కూడా పంజాబ్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు.

    పంజాబ్ ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు నిపుణులు విమర్శించారు. డాక్టర్ బల్బీర్ సింగ్ మాట్లాడుతూ ‘ఇలాంటి వాటిలో కూడా లాభాలను సంపాదించాలని అనుకుంటున్న ప్రభుత్వ నిర్ణయం పట్ల సిగ్గేస్తోంది. ప్రజల దగ్గర నుండి డబ్బులు గుంజుకోవడానికి ఇక వేరే మార్గాలే కనిపించడం లేదా’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సిన్లు అయిపోతే ఇక సాధారణ ప్రజలు బయట డబ్బులు పెట్టి కొనుక్కోకుండా ఇంకేమి చేయగలరు అని విమర్శలు కురిపిస్తూ ఉన్నారు.

    వ్యాక్సిన్ డొనేషన్ చేస్తున్న వారి దగ్గర కూడా లాభాలను ఆర్జిస్తోంది:

    ప్రైవేట్ ఆసుపత్రులకు వ్యాక్సిన్లను అమ్ముతూ లాభాలను సంపాదించడమే కాకుండా.. వ్యాక్సిన్లకు డబ్బులు డొనేట్ చేయాలని అనుకుంటున్నా వారి దగ్గర కూడా డబ్బులు ఎక్కువగా రాబడుతోంది పంజాబ్ ప్రభుత్వం. వ్యాక్సిన్ స్పాన్సర్ల వద్ద 430 రూపాయలు తీసుకుంటూ ఉంది. ఒక్క డోస్ కోవ్యాక్సిన్ ధర 400 రూపాయలే అన్న సంగతి తెలిసిందే.. అయినా కూడా వ్యాక్సిన్ డోనార్ల దగ్గర 430 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటి కోసం పంజాబ్ ప్రభుత్వం ప్రత్యేకంగా అకౌంట్ నెంబర్ ను ఏర్పాటు చేసింది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం పంజాబ్ ప్రభుత్వానికి ఎక్కువగానే చెల్లించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇలా కూడా లాభాలను ఆర్జించడం పంజాబ్ ప్రభుత్వానికే చెల్లిందంటూ తీవ్ర విమర్శలు మొదలయ్యాయి.

    Trending Stories

    Related Stories