దేశంలో న్యాయస్థానాలు సంచలనాలకు కేరాఫ్ అడ్రగా మారుతున్నాయి. జిల్లా కోర్టు నుంచి మొదలు.. సుప్రీంకోర్టు వరకు ఎన్నో సంచలన తీర్పులను వెల్లడిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అలాంటి తీర్పులు అందర్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఓ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ముస్లిం మహిళల పెళ్లి వయస్సుకు సంబంధించి హర్యానా, పంజాబ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముస్లిం అమ్మాయి 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చని తెలిపింది. సింగిల్ జడ్జి జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ తీర్పును వెలువరించారు. తమకు రక్షణ కల్పించాలని ఓ ముస్లిం జంట కోర్టును ఆశ్రయించింది. 16 ఏళ్ల అమ్మాయి, 21 ఏళ్ల అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కావాలని కోర్టును ఆశ్రయించారు.
16 ఏళ్లు నిండిన ముస్లిం మహిళ తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లిచేసుకోవచ్చు అని తెలిపింది. పఠాన్‌కోట్‌కు చెందిన ముస్లిం జంట కోర్టులో కేసు దాఖలు చేసింది. వారిద్దరూ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారు. వారి ప్రాథమిక హక్కుని కాలరాయలేమని జస్టిస్ జస్జిత్ తన తీర్పులో తెలిపారు. ఇస్లామిక్ షరియా చట్టాన్ని తన తీర్పులో ప్రస్తావించారు. ముస్లిం అమ్మాయిల పెళ్లిళ్లు ముస్లిం పర్సనల్ చట్టం పరిధిలోకి వస్తాయని చెప్పారు. ఆర్టికల్ 195 ప్రకారం ముస్లిం అమ్మాయికి 16 ఏళ్లు నిండాయని, ఆ రూల్ ప్రకారం ఆమె పెళ్లి చేసుకోవచ్చు. అబ్బాయి వయసు 21 ఏళ్లు దాటాకా చేసుకోవాలి. ముస్లిం పర్సనల్ లా కూడా దీన్ని అంగీకరిస్తుందని జడ్జి తెలిపారు. ముస్లిం పర్సనల్ లా ప్రకరారం యుక్త వయసు వచ్చిన వారు తాము ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. ముస్లిం జంట ఈ ఏడాది జూన్ 8వ తేదీన పెళ్లి చేసుకోగా.. పెద్దలు వ్యతిరేకించారు. దీంతో ఆ జంట ఆశ్రయించింది. వారికి కోర్టులో ఊరట లభించింది.
ఇంతకుముందు కూడా ఇలాంటి కేసులో పంజాబ్ హైకోర్టు తీర్పును ఇచ్చింది. పంజాబ్‌కు చెందిన ముస్లిం దంపతులు తమ 17 ఏళ్ల కుమార్తె 36 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అల్కా శరీన్ తమ బంధువులు వ్యతిరేకిస్తున్నారనే కారణంతో వీరిద్దరి పెళ్లి చట్ట విరుద్దం కాదని ప్రకటించింది. బంధువుల వ్యతిరేకత వల్ల వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులను భంగం కలగదని హైకోర్టు తీర్పులో పేర్కొంది. జంటకు భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
ఒక్క పంజాబ్ హైకోర్టు మాత్రమే కాదు.. మిగతా రాష్ట్రాల హైకోర్టులు సైతం పలు సంచలన తీర్పులను వెల్లడించాయి. సామాన్యంగా భార్యాభర్తలు వీడిపోయిన సందర్భంలో భార్యకు భర్త భరణం ఇవ్వటం చాలా ఏళ్ల నుంచి వస్తున్న పద్ధతి. అయితే వీడాకులు తీసుకునే భార్య తన భర్తకు భరణం ఇవ్వాలని గత నెలలో బొంబాయి హైకోర్టు తీర్పు చెప్పింది. అలాగే మరో హైకోర్టు కూడా భార్య చదువుకున్నంత మాత్రానా జాబ్ చేయాలని ఏం లేదని అది ఆమె నిర్ణయానికి వదిలేయాలని తీర్పునిచ్చింది. ఇక మైనర్ భార్యతో సంసారం వ్యభిచారం కిందకే వస్తుందని మరో హైకోర్టు తీర్పునిచ్చింది. కేవలం ఒక్క హైకోర్టులే కాదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పులను వెల్లడించింది.