కన్నడ స్టార్ హీరో, దివంగత పునీత్ రాజ్ కుమార్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. పునీత్ భార్య అశ్విని తండ్రి భగ్మనే రేవనాథ్ కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గుండెపోటు వచ్చిన రేవంత్ ను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పునీత్ మరణంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు రేవనాథ్. అప్పటి నుంచి ఆయన తీవ్ర విషాదంలో ఉన్నారని కుటుంబం చెబుతూ వచ్చింది.

పునీత్ రాజ్‌కుమార్ మామ భగ్మనే రేవనాథ్ అల్లుడు మరణించినప్పటి నుండి తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని ఫిల్మీ బీట్ తెలిపింది. ఆయన బెంగళూరులోని M S రామయ్య ఆసుపత్రిలో తుది శ్వాస విడిచాడు. అశ్విని రాజ్‌కుమార్ తండ్రి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు సమాచారం. అయితే అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సకు స్పందించకపోవడంతో కొద్దిసేపటికే మృతి చెందాడు.
భగ్మనే రేవనాథ్ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా(NHAI)కి చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా ముడిగెరె తాలూకాకు చెందినవారు. దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ మాదిరిగానే, రేవంత్ కూడా ఆయన మరణానంతరం తన కళ్లను దానం చేశారు.
పునీత్ రాజ్‌కుమార్ మరణం
పునీత్ మరణాన్ని జీర్ణించుకోడానికి ప్రయత్నిస్తున్న పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్వినిని, వారి కుటుంబ సభ్యులకు రేవంత్ మరణం మరొక షాక్ లాంటిది. పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్ 29న బెంగుళూరులో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.