గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కళ్లను నలుగురికి అమర్చారు. శుక్రవారం గుండెపోటుతో చనిపోయిన పునీత్ కళ్లను అదే రోజు నారాయణ నేత్రాలయ డాక్టర్లు సేకరించారు. వాటిని నలుగురికి అమర్చారని తెలుస్తోంది. టెక్నాలజీతో పునీత్ కళ్ల ఒక్కో కార్నియాను పై పొర, లోపలి పొరగా వేరు చేసి నలుగురికి అమర్చారు. పైపొర సమస్యతో బాధపడే ఇద్దరికి, లోపలి పొరతో బాధపడే మరో ఇద్దరికి పునీత్ కళ్లను అమర్చినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో పునీత్ కళ్లు నలుగురికి చూపును ఇచ్చినట్లు అయ్యింది. గతంలో పునీత్ తండ్రి రాజ్ కుమార్ కూడా కళ్లను దానం చేశారు. ఇపుడు పునీత్ చనిపోయిన తర్వాత కూడా కళ్లు డొనేట్ చేసి నలుగురి జీవితాల్లో వెలుగు నింపారు. ఆయన చూపును అందించిన వారంతా యువతేనని తెలుస్తోంది. అక్టోబరు 29న మరణించిన తర్వాత పునీత్ రాజ్‌కుమార్ కళ్లు దానం చేశారు. ముగ్గురు పురుషులు మరియు ఒక స్త్రీకి గత రెండు రోజులలో నారాయణ నేత్రాలయలో కంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. 2006లో పునీత్ తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్, 2017లో పునీత్ తల్లి పార్వతమ్మ మరణించిన తర్వాత వారి కళ్లను కూడా దానం చేశారు. పునీత్ చనిపోయినట్లు ప్రకటించిన తర్వాత పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ నటుడి కళ్లను సేకరించడానికి నారాయణ నేత్రాలయ నిర్వహిస్తున్న డాక్టర్ రాజ్‌కుమార్ ఐ బ్యాంక్‌కి కాల్ చేశాడు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక్కో కార్నియా (నల్లగుడ్డు)ను పై పొర, లోపలి పొర అని రెండు భాగాలుగా విభజించి ఆ పొరలు అవసరం ఉన్న నలుగురిలో అమర్చామని తెలిపారు. చనిపోయాక కూడా పునీత్ తన కళ్ల ద్వారా నలుగురి జీవితాలలో వెలుగు నింపారు. నారాయణ నేత్రాలయ ఛైర్మన్ డాక్టర్ భుజంగ్ శెట్టి మాట్లాడుతూ పునీత్ కళ్లను ఉంచిన వాళ్లు 20-30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారేనని తెలిపారు. కోవిడ్ -19 కారణంగా నేత్రదానం పూర్తిగా ఆగిపోయినంది. నలుగురు యువత ఆరు నెలలకు పైగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు.