మిగిలింది 3 రాష్ట్రాల్లో.. పుదుచ్చేరి దెబ్బతో కాంగ్రెస్ గల్లంతేనా..?

0
864

కాంగ్రెస్ ముక్త భారత్…! బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి  అమిత్ షా…ఈ నినాదం ఇచ్చినప్పుడూ చాలా మంది రాజకీయ విశ్లేషకులు…, ఇంకా తలపండిన రాజకీయ నేతలు సైతం…, ఈజ్ ఇట్ ఫాజబుల్ అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. కొందరైతే… అమిత్ షా అతిగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. మరికొందరైతే… 130 ఏళ్ళ హిస్టారికల్ పార్టీ అయినా కాంగ్రెస్… ఇక హిస్టరీలో కలవడం కల్లా అన్నారు.!   కానీ అమిత్ షా ఏ మూహూర్తంలో కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారో… ఇప్పుడు అదే నిజమవుతోంది. కాంగ్రెస్ ముక్త భారత్ అనే సుదీర్ఘమైన లక్ష్యాన్ని బీజేపీ శ్రేణుల ముందు ఉంచి… వారిని నిరంతరం కార్యోన్ముఖులు చేయడమే ఈ నినాదం  వెనుక ఉన్న అసలు ఉద్ధేశ్యమని… రాజకీయనేతలందరికీ ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది.

తాజాగా… కాంగ్రెస్ పార్టీ చేతి నుంచి… మరో రాష్ట్రం చేజారింది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కుప్పకూలింది.  అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోలేక… ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి  తన పదవికి రాజీనామా చేశారు. 33 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది. ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామా చేశారు. దాంతో కాంగ్రె్‌స-డీఎంకే కూటమికి స్పీకర్‌తో కలిపి 12 మందే ఎమ్మెల్యేలే మిగిలారు. వీరిలో ఒక స్వతంత్ర ఎమ్మెల్యే కూడా ఉన్నారు. మరోవైపు ఏడుగురు ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, నలుగురు అన్నాడీఎంకే, ముగ్గురు బీజేపీ నామినేటెడ్‌ ఎమ్మెల్యేలతో కలిపి ప్రతిపక్ష కూటమికి 14 మంది ఎమ్మెల్యేలున్నారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడంతో..,  ఇప్పుడు అందరి దృష్టి లెఫ్ట్ నెంట్ గవర్నర్ తీసుకునే నిర్ణయంపైనే పడింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ప్రతిపక్ష కూటమిని ఆహ్వానించడం, లేదంటే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం, ఇంకా అసెంబ్లీని రద్దు చేయడం ఆమె ముందున్న ప్రత్యామ్నాయాలుగా కనిపిస్తున్నాయి.

పుదుచ్చేరిలో రాహుల్ గాంధీ పర్యటించి వెళ్లిన ఒక్క రోజులోనే…, తమ పార్టీ ప్రభుత్వం కుప్పకూలడాన్ని కాంగ్రెస్ నేతలు దిగమింగుకోలేకపోతున్నారు. కొంతమంది అయితే రాహుల్ రాకున్నా బాగుండేదని…, రాహుల్ పర్యటన సందర్భంగా… సీఎం నారాయణ స్వామి వన్ మ్యాన్ షో గా వ్యవహారించారనే విమర్శలు ఉన్నాయి. అంతకు ముందు నుంచే నారాయణస్వామి తీరుపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు…, రాహుల్ పర్యటన ముగిసిన వెంటనే, కాంగ్రెస్ ఝలక్ ఇవ్వడంతో…., ఈ రాష్ట్రం కూడా కాంగ్రెస్ నుంచి చేజారినట్లు అయ్యింది.

ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ…,  పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్  రాష్ట్రాల్లోనే సొంత మెజారిటీతో ప్రభుత్వాలను నడుపుతోంది. మహారాష్ట్ర లో శివసేన, ఎన్సీపీ కూటమితో కలిసి అధికారాన్ని పంచుకుంటోంది. అలాగే ఝార్ఖండ్ లోనూ జేఎంఎం తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతోంది.

2014లో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో….,  దేశంలో 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంత బలంతో ప్రభుత్వాలు ఉండేవి. అలాగే మరో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్…, మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాలు నడిపేది. అయితే 2021 వచ్చేనాటికి ఈ సంఖ్య మూడుకు పడిపోయింది. కేవలం రెండు రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతోంది.

నిజానికి 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో… కాంగ్రెస్ పార్టీ..,  చత్తీస్ గఢ్, కర్ణాటక, రాజస్థాన్ , మధ్య ప్రదేశ్ లలో ప్రభుత్వాలను చేసింది. కర్ణాటకలో తమ పార్టీ ఓటమి పాలైనా… బీజేపీకి అధికారం దక్కకూడదనే అక్కసుతో… పోలింగ్ ముందు రోజు వరకు కూడా ఏ జేడీఎస్ అధినేత కుమారస్వామినైతే  విమర్శించేందో…, అదే కుమార స్వామిని ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ..,  జేడీఎస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే 2019లో ఈ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రస్తుతం అక్కడ యెడ్యూరప్ప నేతృత్వంలో… బీజేపీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది.

అలాగే మధ్యప్రదేశ్ లో సైతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2020లో జ్యోతిరాదిత్య సింధియాతో నెలకొన్న అంతర్గత కలహాలమూలంగా… అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. ఇక మధ్యప్రదేశ్ కూడా బీజేపీ చేతుల్లోకి వెళ్లిపోయింది.

ఇటు 2020లో అయితే రాజస్థాన్ లో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితే ఉత్పన్నం అయ్యాయి.  సీఎం అశోక్‌ గహ్లోత్‌కు, సీనియర్ నేత సచిన్ పైలట్ కు మధ్య నెలకొన్న విభేదాల మూలంగా..,  పార్టీ చీలిపోయే పరిస్థితి ఏర్పడింది. క్యాంప్ రాజకీయాలు కూడా నడిచాయి. చివరకు సయోధ్య కుదిరినా…,  ఇంకా కూడా… రెండు వర్గాల మధ్య లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి.  

ఇక నార్త్ ఈస్ట్ అయితే ఇప్పటికే కాంగ్రెస్ ముక్త్ భారత్ అయ్యింది. ఈశాన్య భారత్ లోని… అసోం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయా, మిజోరాం…, మొత్తం 8 రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలే అధికారంలో కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉనికిలో లేకుండా పోయింది.

మరోవైపు రోజు రోజుకు దిగజారుతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై…గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ వంటి 23 మంది సీనియర్లు ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు  లేఖ కూడా రాసిన ప్రయోజనం లేకపోయింది.  దేశంలో ప్రాభావాన్ని కోల్పోతున్న కాంగ్రెస్…, మరికొన్ని నెలల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఆశలు పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్ , అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి అంతతమాత్రంగానే ఉంది. కేరళలో కూడా బీజేపీ బలపడుతుండటం…, వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి..,  కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వాయినాడ్ లోక్ సభ నియోజకవర్గాన్ని కూడా వదిలేస్తాడని.., మరో కొత్త నియోజకవర్గానికి వెళ్తాడనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఆశాకిరణమే… తన సొంత నియోజకవర్గం అమేథిని వదిలి…, కేరళ కు రావడం, అందులోనూ ముస్లిం మెజారిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడమంటేనే కాంగ్రెస్ కాడిని వదిలేసినట్లేగా…! జస్ట్ థింక్…

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

1 × four =