More

    ప్రధానిని ‘అంతర్జాతీయ బిచ్చగాడు’ అంటూ వీడియో తీశాడు

    పాకిస్థాన్ నూత‌న ప్ర‌ధాన మంత్రిగా షెహ‌బాజ్ ష‌రీఫ్ ఎన్నిక‌య్యారు. పాక్ జాతీయ అసెంబ్లీలో జ‌రిగిన ఎన్నిక‌లో ఆయ‌న పాక్ ప్ర‌ధానిగా ఎన్నిక‌య్యారు. అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ స‌ర్కారు ఓట‌మిపాలు కాగా.. కొత్త ప్ర‌ధానిగా షెహ‌బాజ్ ష‌రీఫ్‌ను విప‌క్షాలు ప్ర‌తిపాదించాయి. మెజారిటీని నిరూపించుకోవాలంటూ షెహ‌బాజ్‌కు జాతీయ అసెంబ్లీ పిలుపునిచ్చింది. ఈ మేర‌కు సోమ‌వారం జాతీయ అసెంబ్లీ స‌మావేశం కాగా అంత‌కుముందు జాతీయ అసెంబ్లీ స‌భ్య‌త్వానికి త‌న‌తో పాటు త‌న పార్టీ సభ్యులు కూడా రాజీనామా చేస్తున్న‌ట్టు ఇమ్రాన్ ప్ర‌క‌టించారు. సోమ‌వారం నాటి జాతీయ అసెంబ్లీకి హాజ‌రు కాలేదు. పాక్ నూత‌న ప్ర‌ధానిగా షెహ‌బాజ్ ష‌రీఫ్ ఎన్నికయ్యారు.

    పాకిస్తాన్‌లో రాజకీయ గందరగోళం ఏర్పడిన సంగతి తెలిసిందే..! అయితే పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ నుండి వైరల్ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు అందరి కంటా పడింది. దేశానికి కొత్తగా ఎన్నికైన ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ‘అంతర్జాతీయ బిచ్చగాడు’ అని కరాచీకి చెందిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఎంఎన్ఎ ఫహీమ్ ఖాన్ పిలుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ సభ్యులు తమ రాజీనామాలను సమర్పించినప్పుడు, ప్రతిపక్ష నాయకుడు షెహబాజ్ షరీఫ్ దగ్గర సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.

    పాకిస్తాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందు రికార్డ్ చేసిన వీడియోలో, MNA ఫహీమ్ ఖాన్, “ప్రస్తుతం, నేను నేషనల్ అసెంబ్లీలో నిలబడి ఉన్నాను. నేను మీకు అంతర్జాతీయ బిచ్చగాడిని చూపించాలనుకుంటున్నాను” అని చెప్పడం వినిపించింది. ఆ వీడియో మీరు కూడా చూసేయండి.

    Trending Stories

    Related Stories