మరోసారి గవర్నర్ తమిళిసైకి అవమానం

0
822

తెలంగాణ గవర్నర్, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఏ మాత్రం సమన్వయం కనిపించడం లేదు. గత కొంత కాలంగా గవర్నర్ ఎక్కడికి వెళ్లినా అధికారులు సరైన ప్రోటోకాల్ పాటించడం లేదు. తాజాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన గవర్నర్ తమిళి సైకి మరోసారి అవమానం జరిగింది. గవర్నర్ పర్యటనను పట్టించుకోలేదు కొత్తగూడెం జిల్లా ఉన్నతాధికారులు. జిల్లాకు వచ్చిన గవర్నర్ స్వాగత కార్యక్రమానికి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ హాజరవ్వలేదు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు హైదరాబాద్ నుంచి రాత్రి రైలులో వెళ్లారు గవర్నర్ తమిళి సై. మణుగూరు చేరుకున్న గవర్నర్ కు అక్కడ ఆశ్వాపురం తహశీల్దార్ సురేష్, అడిషనల్ ఎస్పీ కేఅర్కే ప్రసాద్ స్వాగతం చెప్పారు. గవర్నర్ ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వాగతం చెప్పాల్సి ఉన్నా.. వారు గవర్నర్ ను రిసీవ్ చేసుకోలేదు. రాత్రి అశ్వాపురంలోని హెవీవాటర్ ప్లాంట్ విశ్రాంతి భవనంలో గవర్నర్ బస చేశారు. ఆదివారం ఆమె అశ్వాపురంలోని పాములపల్లి, చింతిర్యాలకాలనీతో పాటు పలు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పునరావాస కేంద్రాల్లో పరిస్థితిని పర్యవేక్షించి ముంపు బాధితుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు గవర్నర్. ఇక ఇటీవల నల్గొండ జిల్లాలో గవర్నర్ తమిళి సై పర్యటించినా నల్గొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆమెకు స్వాగతం చెప్పలేదు.