More

    డాక్టర్ వసంత్ చెప్పేది నిజమేనా..? కరోనాకు మందు కనిపెట్టాడా..??

    హైదరాబాద్ సుల్తాన్ బజార్ యూపీహెచ్‌సీలో డాక్టర్ వసంత్ నిరసనకు దిగారు. కరోనాకు మందు కనిపెట్టినా కూడా తనకు ఉన్నతాధికారులు సహకరించడం లేదని ఆయన ఆందోళన చేస్తున్నారు. తన రూమ్ లోకి పెట్రొల్ బాటిల్ పట్టుకొని వెళ్లారు. బయటకు రాకుండా నిరసన చేస్తున్నారు. కరోనాకు మందు కనిపెట్టిన తనను ప్రోత్సహించాలని ఆయన కోరుతున్నారు. వసంత్ గతంలో గాంధీ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ గా పనిచేశారు. గాంధీ ఆసుపత్రి నుండి సుల్తాన్ బజార్ యూపీహెచ్‌సీలో డాక్టర్ వసంత్ మెడికల్ ఆఫీసర్ గా బదిలీ అయ్యారు. ఐదు రోజుల్లో తాను తయారు చేసిన మందుతో కరోనాను నయం చేయవచ్చన్నారు. తాను తయారు చేసిన మందుకు కేవలం రూ. 45 మాత్రమేనని డాక్టర్ వసంత్ తెలిపారు.

    డాక్టర్ వసంత్ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సంఘటనా స్థలానికి వెళ్లి దీక్షను విరమించాలని వసంత్‭ను కోరారు. ఆందోళన చేస్తున్న డాక్టర్‭కు సంఘీభావం తెలిపిన ఆయన తలుపులు తెరిచి బయటికి రావాలన్నారు. పోలీసులు వెళిపోతేనే బయటకు వస్తానని చెప్పిన వసంత్.. చివరికి తలుపులు తెరిచారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రాజాసింగ్ హామీ ఇచ్చారు. డాక్టర్ వసంత్ గురించి మాట్లాడేందుకు మంత్రి హరీష్ రావుకు ఫోన్ చేస్తే స్పందించలేదని రాజాసింగ్ అన్నారు. కరోనా సమయంలో తమ ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వహించిన వైద్యుల పట్ల ప్రభుత్వానికి చిన్న చూపు తగదని అసహనం వ్యక్తం చేశారు. డాక్టర్ వసంత్ అంశాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి వివరించానని తెలిపారు. హైదరాబాద్ రాగానే వసంత్ తో మాట్లాడతానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.

    Trending Stories

    Related Stories