More

  ప్రధాని జెండా ఎగురవేయకుండా అడ్డుకుంటే మి. డాలర్ల ప్రైజ్ మనీ..! ఆగస్ట్ 15 టార్గెట్‎గా SFJ విష ప్రచారం..!!

  ఖలిస్తానీల ఆగడాలు అంతకంతకూ మించిపోతున్నాయి. రైతుల ఇప్పటికే ఉద్యమాన్ని హైజాక్ చేసి.. జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ముష్కరులు.. దేశంపై విషం చిమ్ముతున్నారు. ఎర్రకోటపై ఖలిస్తానీ జెండాను ఎగురవేసి దేశ గౌరవాన్ని అగౌరవపరిచిన వీళ్లు.. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రినే టార్గెట్ చేశారు. నిషేధిత సిక్ ఫర్ జస్టిస్ సంస్థ జనరల్ సెక్రెటరీ.. ఖలిస్తాన్ వేర్పాటువాది గురుపట్వంత్ సింగ్ పన్ను.. తాజాగా యూట్యూబ్ లో ఓ ఆడియో రికార్డును విడుదల చేశాడు. పంద్రాగస్టు రోజున ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేయకుండా అడ్డుకున్నవాళ్లకు మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటించాడు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పెయిడ్ ఉద్యమాన్ని నడిపిస్తున్న సోకాల్డ్ రైతు సంఘాలకు మద్దతుగా మాట్లాడిన పన్ను.. వేర్పాటువాద ఉద్యమాన్ని మరింత ముందకు తీసుకెళ్తామని.. పంజాబ్‎ను భారత్ నుంచి వేరు చేస్తామని అన్నాడు. అంతేకాదు, ఖలిస్తానీలు ఢిల్లీని కూడా హస్తగతం చేసుకుంటారని.. ఎర్రకోటపై ఖలిస్తానీ జెండా ఎగురవేస్తామని విషపు కూతలు కూశాడు. ఇందుకోసం దేశ రాజధాని పౌరులు ఖలిస్తాన్ ఉద్యమంలో పాల్గొనాలని లేదంటే, కనీసం మద్దతుగా నిలవాలని కోరాడు.

  ఈ ఏడాది ప్రారంభంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ముందు ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని ఇలాగే ఎగదోశాడు గురుపట్వంత్ సింగ్ పన్ను. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో పెయిడ్ ఉద్యమం చేస్తున్న సోకాల్డ్ రైతు సంఘాలు.. ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి ఎర్రకోటను అపవిత్రం చేసిన తర్వాత.. ఖలిస్తానీలు సంబరాలు చేసుకున్నారు. రైతుల ముసుగులో ఆందోళనల్లో పాల్గొన్న కొందరు వేర్పాటువాద మూకలు ఎర్రకోటపై ఖలిస్తానీ జెండాను ఎగురవేశాయి. ఇప్పుడు ఏకంగా ప్రధానిని జెండా ఎగురవేయకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చిన గురుపట్వంత్ సింగ్ పన్ను.. భారత్ పై మరోసారి విషం చిమ్మాడు.

  నిషేధిత సిక్ ఫర్ జస్టిస్ సంస్థ కొద్దిరోజుల ముందు.. పలువురు ముఖ్యమంత్రులకు కూడా ఇలాంటి హెచ్చరికలే జారీ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగురవేయరాదంటూ పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు వార్నింగ్ ఇచ్చింది. తనను తాను సిక్ ఫర్ జస్టిస్ ప్రధాన కార్యదర్శిగా పరిచయం చేసుకున్న గురుపట్వంత్ సింగ్ పన్ను.. పంజాబ్ సీఎం, గవర్నర్లను హెచ్చరిస్తూ ఆడియో మెసేజ్ విడుదల చేశాడు. అంతేకాదు, మీ రాజకీయ పతనానికి మీరే బాధ్యత వహించాల్సివుంటుందని కూడా వార్నింగ్ ఇచ్చాడు.

  ఒక్క పంజాబ్ ముఖ్యమంత్రికే కాదు.. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, హర్యానా ముఖ్యమంత్రి మనోహరల్ లాల్ ఖట్టర్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు సైతం ఇలాంటి మెసేజ్ లే పంపాడు. హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ కు చేసిన రికార్డెడ్ ఫోన్ కాల్ లో తనను తాను ఎస్.ఎఫ్.జె. కార్యదర్శిగా పరిచయం చేసుకున్నాడు గురుపట్వంత్ సింగ్. అంతేకాదు, ఆగస్ట్ 15న జైరామ్ ఠాకూర్ ను జెండా ఎగురవేయనివ్వమని ప్రగల్భాలు పలికాడు. హిమాచల్ ప్రదేశ్ ఒకప్పుడు పంజాబ్ లో భాగమని.. పంజాబ్ ను దేశం నుంచి వేరు చేసిన తర్వాత.. ఆ ప్రాంతాన్ని కలిపేసుకుంటామన్నాడు.

  హర్యానా సీఎంకు కూడా ఇలాగే రికార్డెడ్ మెసేజ్ పంపాడు. మనోహర్ లాల్ ఖట్టర్ జెండా ఎగువేయనివ్వబోమని హెచ్చరించాడు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కూడా రికార్డెడ్ వాయిస్ మెసేజ్ పంపిన గురుపట్వంత్ సింగ్.. కేవలం జెండా ఎగురవేయొద్దంటూ వార్నింగ్ ఇవ్వడమే కాకుండా.. స్వాతంత్ర్య దినోత్సవం రోజున పవర్ ప్లాంట్లను షడ్ డౌన్ చేయాలని సూచించాడు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల పోలీసులు అలర్టయ్యారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సెక్యూరిటీ పెంచారు.

  సీఎంలకు వచ్చిన బెదిరింపు కాల్స్ ను సీరియస్ గా తీసుకున్న యూపీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ సైబర్ క్రైం పోలీసులు.. సిక్ ఫర్ జస్టిస్ కార్యదర్శి గురుపట్వంత్ సింగ్ పన్నుపై కేసులు నమోదు చేశారు. ఇక, ఇప్పటికే సాగు చట్టాల పేరుతో రైతుల ముసుగేసుకుని ఖలిస్తానీలు అరాచకాలు సృష్టిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని.. అటు భారత ప్రభుత్వం కూడా నిఘాను పెంచింది.

  Trending Stories

  Related Stories