More

    ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయిన ప్రియాంక గాంధీ వాద్రా

    కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారిన పడ్డారనే విషయం తెలిసిందే..! ఇప్పుడు ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత రాణదీప్ సింగ్ సూర్జేవాలా వెల్లడించారు. కరోనా లక్షణాలు ప్రియాంక వాద్రాలో కనిపించాయని.. కరోనా పరీక్షలు చేసుకోగా ఆమెకు పాజిటివ్ గా నిర్ధారణ అయిందని సూర్జేవాలా చెప్పుకొచ్చారు. దీంతో ప్రియాంక గాంధీ వాద్రా ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.

    కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని రణదీప్ సూర్జేవాలా గురువారం తెలిపారు. “ఆమె వైద్యుల సలహా మేరకు ఐసోలేషన్ లో ఉన్నారు” అని సుర్జేవాలా చెప్పారు. సోనియా గాంధీకి తేలికపాటి జ్వరం ఉందని చెప్పారు. ఆమె కోలుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఆమెకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తాము అని చెప్పారు. 75 ఏళ్ల సోనియా గాంధీ గత వారం రోజులుగా నాయకులు, కార్యకర్తలను కలుస్తున్నారు. వీరిలో కొందరికి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిందని పార్టీ అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు.

    Trending Stories

    Related Stories