బుర్ఖా ముద్దు..! మంగళసూత్రం వద్దు..!!

0
733

హిందూ వివాహబంధానికి ప్రతీక మంగళసూత్రం. హిందూ వివాహ వ్యవస్థకు నిలువుటద్దం. భారతీయ మహిళకు మంగళసూత్రాన్ని మించిన ఆభరణం లేదు. అందుకే, పాశ్యాత్య జ్యుయలరీ కంపెనీలు సైతం.. మంగళసూత్రాన్ని తయారుచేసేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేస్తాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల తగిన విధంగా మంగళసూత్రాన్ని డిజైన్ చేస్తాయి. ప్రఖ్యాతిపొందిన ఇటలీ జ్యుయెలరీ సంస్థ బూల్గరీ.. తొలిసారి మంగళసూత్రాన్ని మార్కెట్‎లోకి తీసుకొచ్చింది. వజ్రాలు పొదిగిన 18 క్యారెట్ల యెల్లో గోల్డ్‎తో మంగళసూత్రాన్ని డిజైన్ చేసింది బూల్గరీ. ఆభరణాల తయారీలో సంప్రదాయాన్ని మేళవేస్తూ.. ఆధునిక భారతీయ మహిళల ఆకాంక్షలకు తగినట్టుగా ఈ మంగళసూత్రాన్ని తీర్చిదిద్దింది. తాజాగా బూల్గరీ మంగళసూత్రం ప్రమోషన్‎లో భాగంగా.. ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అయిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.. వోగ్ మేగజైన్ ఫొటోషూట్‎లో పాల్గొన్నది. బూల్గరీ బ్రాండ్ మంగళసూత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది.

బూల్గరీ మంగళసూత్రం ఆవిష్కరణ పట్ల ఆ కంపెనీ బిజినెస్ యూనిట్ మేనేజింగ్ డైరెక్టర్ మౌరో డి రాబర్టో సంతోషం వ్యక్తం చేశారు. 2014లో భారతీయ మార్కెట్లో ప్రవేశించిన నాటి నుంచి.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు తగ్గట్టుగా ఆభరణాలు తయారు చేయడంపై దృష్టిసారించామని.. ఆధునిక భారతీయ మహిళ కోసం మంగళసూత్రాన్ని రూపొందించడానికి మాకు చాలా సంవత్సరాలు పట్టిందని తెలిపారు. మంగళసూత్రం అనేది భారతీయ వివాహితకు అత్యంత ప్రధానమైన ఆభరణమని అన్నారు. మంగళసూత్రం తయారీలో భారతీయ సంప్రదాయ విలువల్ని జోడించేందుకు.. మా ఇండియన్ టీమ్‎తో కలిసి చాలా వర్కౌట్ చేశామని తెలిపారు. ఆధునిక భారతీయ మహిళ జీవనశైలిని ప్రతిబింబించేలా మంగళసూత్రాన్ని తీర్చిదిద్దినట్టు చెప్పుకొచ్చారు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాంటి సందర్భంలోనైనా, చివరికి మోడ్రన్ డ్రెస్‎లపైనా ధరించేవిధంగా.. మంగళసూత్రాన్ని తయారుచేశామన్నారు. ఇండియన్ వుమెన్‎ను ప్రతిబింబించేలా.. ఇవాళ మా కంపెనీ మంగళసూత్రాన్ని ప్రియాంక చోప్రా అద్భుతంగా ఆవిష్కరించారని కొనియాడారు.

ఇదీ భారతీయతకు, ఇక్కడి విలువలకు ఓ పాశ్యాత్య కంపెనీ ఇచ్చిన విలువ. కానీ, కొందరు సోకాల్డ్ ఫెమినిస్టులకు.. హైందవ సంప్రదాయమంటే గిట్టదు. బ్రిటిష్ బానిసత్వపు వాసనలు వారిని ఇంకా వీడలేదు. అందుకే, ప్రియాంక చోప్రా మెడలో కనపించిన మంగళసూత్రంలో కూడా వాళ్లు బానిసత్వాన్నే వెతుక్కున్నారు. మంగళసూత్రాన్ని ప్రచారం చేస్తావా.. అంటూ ప్రియాంక చోప్రాను నిందించారు. ట్విట్టర్‎లో వెర్రికూతలు కూశారు. అది పితృస్వామ్యానికి చిహ్నమని.. అలాంటి ఆభరణాలను ధరించి ఎలా ప్రచారం చేస్తావంటూ.. హిందూ ధర్మం పట్ల నరనరానా జీర్ణించుకుపోయిన వారి అక్కసును వెళ్లగక్కారు. తన ప్రొఫైల్‎లో తనను తాను ‘మార్క్సిస్ట్ – ఫెమినిస్ట్’‎గా ప్రకటించుకున్న.. ఓ 19 ఏళ్ల ‘క్విన్‎బూట్’ అనే ట్విట్టర్ యూజర్.. ప్రియాంక చోప్రాపై విమర్శలు గుప్పించింది. ప్రియాంక చోప్రా డబ్బుకోసం స్త్రీవాదాన్ని బలిపెడుతోందని ట్వీట్ చేసింది. అంటే, ఓ మంగళసూత్రం యాడ్‎లో పాల్గొంటే స్త్రీవాదాన్ని బలిపెట్టినట్టా..?

ఇక, మరో సోకాల్డ్ ఫెమినిస్ట్ పైత్యం చూద్దాం.. బూల్గరీతో జట్టుకట్టిన ప్రియాంక చోప్రా డబ్బుకోసమే మంగళసూత్రాన్ని ప్రచారం చేస్తోందని రాసుకొచ్చిందావిడ. అంతటితో ఆగలేదు. వివాహబంధానికి చిహ్నమైన మంగళసూత్రాన్ని.. సామాజిక దురాచారమైన వరకట్నంతో పోల్చి అవహేళన చేసింది. ఇక, ఇండియా టుడే మాజీ జర్నలిస్ట్ ఐశ్వర్య సుబ్రమణ్యం ఓ అడుగు ముందుకేసింది. ఈవిడగారి విమర్శలు మంగళసూత్రంతో ఆగలేదు.. హైందవ సంప్రదాయ చిహ్నామైన యజ్ఞోపవీతాన్ని కూడా అవమానించింది. మన సమాజంలో సోకాల్డ్ ఫెమినిస్ట్‎లుగా చెలామణి అయ్యే వీరంతా మహిళ హక్కులకు బ్రాండ్ అంబాసిడర్లుగా కలరింగ్ ఇస్తూవుంటారు. తాము ఉన్నాం కాబట్టే మహిళల హక్కులు మనగలుగుతున్నాయనే భ్రమలో హిందుత్వంపై బురదజల్లుతూవుంటారు.

ఎడారి మతాలకు వివాహం అంటే ఓ అగ్రిమెంట్ మాత్రమే. వాళ్లు, మన వివాహ వ్యవస్థను, వైదిక సంప్రదాయాలు విమర్శించారంటే ఓ అర్థం వుంది. మరి, భారతదేశంలో పుట్టి, హైందవ వివాహ సంస్కృతిని విమర్శిస్తున్న వీళ్లను ఏమనాలి..? కమ్యూనిస్టు భావజాలంలో పీకల్లోతు మునిగిపోయిన ఈ సోకాల్డ్ ఫెమినిస్టులు ఇక మారరా..? నాకు తెలియక అడుగుతాను.. వీళ్లు విమర్శించడానికి హైందూమతమే దొరకుతుందా..? వైదిక సంప్రదాయాలు, హిందూ వివాహవ్యవస్థ అంటే ఎందుకు వీళ్లకు ఎందుకంత మంట. ఓ ముస్లిం మహిళ బుర్ఖా వేసుకుంటే తప్పులేదు.. కానీ, ఓ హిందూ వివాహిత మంగళసూత్రం ధరిస్తే మాత్రం వీళ్లకు ఫెమినిజం గుర్తొస్తుంది. బుర్ఖా వేసుకోవడం తప్పు అని చెప్పమనండి చూద్దాం. ఆ మాట వింటేనే వీళ్లకు ముచ్చెమటలు పోస్తాయి. వెన్నులో వణుకుపుడుతుంది. పైగా బుర్ఖా వేసుకోవడం వాళ్లకు ఛాయిస్ అంటూ ఈ సోకాల్డ్ ఫెమినిస్టులు ఉద్యమాలు సైతం నడిపారు. మరి, బుర్ఖా ధరించడం ఛాయిస్ అయినప్పుడు.. మంగళసూత్రాన్ని కూడా ఛాయిస్‎గా ఎందుకు భావించరు..?

నేడు మంగళసూత్రాన్ని ఎగతాళి చేస్తున్న ఈ సోకాల్డ్ ఫెమినిస్టులు.. రేపు మహిళలు బొట్టుపెట్టుకోవడం, చీర కట్టుకోవడం కూడా తప్పని వాదిస్తారేమో..! ఇతర మతాల్లోని లొసుగులను ప్రశ్నించడం వీళ్లకు చేతకాదు. ఎంతసేపు హిందూ మతంపైనే పడి ఏడుస్తూవుంటారు. మంగళసూత్రంలో వీళ్లకు విషనాగులు కనిపిస్తాయి. కానీ, లవ్ జిహాద్‎లో మాత్రం అమితమైన ప్రేమ కనిపిస్తుంది. దురుద్దేశంతో హిందూ బాలికలను పెళ్లిచేసుకుని.. వారిని మతం మార్చి నానాహింసలు పెట్టి, వేశ్యా గృహాలకు, గల్ఫ్ దేశాలకు అమ్మేస్తున్నా.. వారికి అది ప్రేమ వివాహంగానే తోస్తుంది. మతమార్పిడి పేర్లతో హిందూ మహిళలపై.. చర్చి ఫాదర్లు చేస్తున్న అఘాయిత్యాలు కూడా వీళ్ల కంటికి కనిపించవు. మెడలో తాళిబొట్టు, నుదిటిపై కుంకుమబొట్టు.. ఇవే కనిపిస్తాయి. వీటినే భూతద్ధం పెట్టి చూస్తారు. సంప్రదాయంగా కనిపించే హిందూ మహిళలే.. ఈ సోకాల్డ్ ఫెమినిస్టులకు ప్రధాన శత్రువులు. హిందూ వివాహవ్యవస్థను అపహాస్యం చేస్తున్న వీరి ఆగడాలపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా వుంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here