ఏపీకి చేరుకున్న భారత రాష్ట్రపతి

0
638

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో రాష్ట్రపతికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ లో పోలీసుల గౌరవ వందనాన్ని రాష్ట్రపతి స్వీకరించారు. పోరంకిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్ పౌర సన్మానం చేయనున్నారు. మధ్యాహ్నం 2:45కు రాష్ట్రపతి విశాఖపట్నం బయలుదేరుతారు. విశాఖలోని ఆర్ కే బీచ్ లో జరగనున్న నౌకాదళ కార్యక్రమానికి హాజరై, విన్యాసాలను తిలకిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు కేంద్ర-రాష్ట్ర మంత్రులు, నేవీ చీఫ్‌ హాజరుకానున్నారు. సాయంత్రం 6.10 గంటలకు నేవీ హౌజ్ లో జరిగే నేవీ డే రిసెప్షన్లో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు విశాఖపట్నం నుంచి తిరుపతికి రాష్ట్రపతి పయనమవుతారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ను బలగాలు తమ ఆధీనంలో తీసుకున్నాయి. రాష్ట్రపతి ప్రయాణించే పోరంకి, నిడమానూరు ప్రధాన రహదారిపై గస్తీ పెంచారు. రోడ్డుపై ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా బారికేడ్స్‌ ఏర్పాటు చేశారు.