More

    ఆ నిందితులపై రివార్డ్ ప్రకటించిన ఎన్ఐఏ..!

    2022 సంవత్సరంలో బీజేపీ యువమోర్చా నేత ప్రవీణ్ నెట్టారు హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిషేధిత రాడికల్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తో సంబంధాలున్న 20 మంది నిందితులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. సమాజంలో తీవ్రవాదం, మతపరమైన ద్వేషం, అశాంతిని సృష్టించేందుకు.. 2047 నాటికి భారత్ లో ఇస్లామిక్ పాలనను స్థాపించాలనే ఎజెండాలో భాగంగా PFI బృందాలు కొందరిని చంపడానికి రహస్య బృందాలను ఏర్పాటు చేసుకున్నాయని ఎన్‌ఐఎ జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.

    ఈ కిల్లర్ టీమ్ సభ్యులకు దాడి చేయడంలో శిక్షణ, సాంకేతిక శిక్షణతో పాటు ఆయుధాలు కూడా ఇస్తారు. సీనియర్ PFI నాయకుల సూచనల మేరకు, కొందరిని టార్గెట్ చేసి వారిపై దాడి చేయడానికి, చంపడానికి ఈ బృందాలు ప్రయత్నిస్తాయి. బెంగుళూరు, సుల్లియా టౌన్, బెల్లారే గ్రామంలో PFI సభ్యులు, నాయకుల సమావేశాలు జరిగాయి. జిల్లా బృందానికి సంబంధించిన ముస్తఫా పైచార్ ఓ వ్యక్తి గురించి చెప్పి.. అతడిని లక్ష్యంగా చేసుకోవాలని ఆదేశించాడు. దీంతో నలుగురు వ్యక్తులకు బాధ్యతలు అప్పజెప్పారు. జులై 2022లో, బీజేపీ యువమోర్చా జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్న ప్రవీణ్ నెట్టారును ప్రజలందరిలో చంపేయాలని నిర్ణయించారు. ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన సభ్యులలో భయాందోళనలు సృష్టించేందుకు మారణాయుధాలతో దాడి చేసి చంపారు. ఈ దారుణ హత్యకు సంబంధించి 20 మందిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 20 మంది చార్జిషీట్‌లో ముస్తఫా పైచార్, మసూద్ కెఎ, కొడాజె మహమ్మద్ షెరీఫ్, అబూబక్కర్ సిద్దిక్, ఉమ్మర్ ఫరూక్ ఎంఆర్, తుఫైల్ ఎంహెచ్ పరారీలో ఉన్నారు. వారి అరెస్టుకు సంబంధించిన సమాచారం ఇచ్చే వారికి రివార్డు కూడా ఇస్తామని తెలిపారు.

    జులై 26న కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. మంగళూరులోని పుట్టూరు – సుల్లియా రోడ్డులో ప్రవీణ్ నెట్టారును దారుణంగా నరికి చంపారు. తప్పించుకుని తిరుగుతున్న వారిని పట్టించిన వారికి రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని చెప్పింది. సమాచారం చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎన్ఐఏ స్పష్టం చేసింది. నిందితులకు సంబంధించిన సమాచారాన్ని info.blr.nia ద్వారా పంపవచ్చని చెప్పింది. మరింత సమాచారం కోసం uw gov.in లేదా 080 – 29510900, 8904241100 ను సంప్రదించవచ్చని సూచించింది.

    Trending Stories

    Related Stories