జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాడిన భాష అత్యంత హేయమని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. తమ పార్టీ వారిని కొడకల్లారా అంటూ చెప్పు చూపించటం పవన్ దిగజారుడు తనానికి పరాకాష్ట అన్నారు. తాను అదే భాష మాట్లాడగలనని కానీ సంస్కారం అడ్డు వస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ తండ్రి వెంకటరావ్, అన్న చిరంజీవి అంటే తనకు గౌరవం ఉందని, అందుకే ఆ భాష మాట్లాడలేకపోతున్నానని అన్నారు. నిన్న మధ్యాహ్నం వరకూ బీజేపీతో స్నేహం చేసిన పవన్ సాయంత్రానికి ప్లేటు ఫిరాయించి చంద్రబాబుతో చేతులు కలిపారని విమర్శించారు.