ప్రధాని మోదీ పర్యటన.. ప్రకాష్ రాజ్ ట్వీట్

0
716

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో పలువురు స్పందిస్తూ వస్తున్నారు. నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాశ్ రాజ్ తెలంగాణలో అద్భుత పాలన నడుస్తోందని.. పాలన ఎలా ఉండాలో చూసి నేర్చుకోవాలని కామెంట్లు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోదీ పర్యటనల సమయంలో ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన మొత్తంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు వేస్తుంటారని, కానీ, తెలంగాణలో మాత్రం ప్రజల అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తారని.. ఈ పర్యటనను ఆస్వాదించాలని, దూరదృష్టితో మౌలిక సదుపాయాలు ఎలా అందించాలో చూసి నేర్చుకోవాలని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. నీటి ప్రాజెక్టు, యాదాద్రి, టీ హబ్2, ప్రభుత్వ ఆసుపత్రి, గురుకుల పాఠశాల భవనాలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.