More

  ది ‘ఫేక్’రాజ్..! అన్నీ అబద్దాలే..!!

  కోట్ల నల్లధనంవెలికి వస్తుందనే సదుద్దేశంతో.. ఓట్ల రాజకీయాన్ని పట్టించుకోకుండా ఆరేళ్ల క్రితం మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు చేసింది. అయితే, మంచి ఉద్దేశంతో చేసిన పనిపైనా.. కుహనా గ్యాంగ్ లు రాళ్లు విసురుతున్నాయి. వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్‎గా వుండే సినీ నటుడు ప్రకాష్ రాజ్.. నోట్ల రద్దు విషయంపై తెగ లెక్చర్లు దంచేస్తున్నాడు. నోట్ల రద్దుకు ముందు మోదీ ప్రభుత్వం RBIని సంప్రదించడంపై ప్రకాష్ రాజ్ అబద్ధపు కట్టుకథలు సృష్టించి.. అవే వాస్తవాలు అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 2016 నవంబరు 8 అర్థరాత్రి నుంచి అన్ని 500, 1000 రూపాయల నోట్లు చట్టబద్ధమైన మారక విలువను కోల్పోతాయని కేంద్ర సర్కారు ప్రకటించింది. ఆ రోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఈ కీలక ప్రకటన చేశారు. బ్లాక్ మనీకి చెక్ పెట్టి, పెద్దల గుండెల్లో రైళ్లు పరుగెట్టించాలని ప్రధాని మోదీ ఈ ఆకస్మిక చర్య చేపట్టారు. తాపీగా ఈ పని నిర్వహిస్తే..అసలు లక్ష్యానికే విఘాతం కలుగుతుందని భావించారు. ప్రకాష్ రాజ్ ఫేక్ ట్వీట్ల కథనం వీక్షించే ముందు నేషనలిస్ట్ గ్రూపాఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.

  డీమానిటైజేషన్‎పై ఆనాటి నుంచి ప్రధానిపై విమర్శలు ఎదురవుతూనేవున్నాయి. లెఫ్ట్ లిబరల్ కుహనా లౌకిక వాదులంతా నోట్లరద్దుపై పనిగట్టుకుని దుష్ప్రచారం కొనసాగిస్తూనేవున్నారు. డిమానిటైజేషన్ కు సంబంధించి ప్రధాని ట్వీట్ ను, మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ట్వీట్ ను జోడిస్తూ.. ప్రకాష్ రాజ్ కొత్త నాటకాన్ని రక్తికట్టించారు. డియర్ సిటిజన్స్.. ఎవరు నిజం చెబుతున్నారు..? జస్ట్ ఆస్కింగ్ అంటూ జనాన్ని అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేశారు. మరోవైపు ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అబద్ధం చెప్పిందని.. తన అబద్ధాల లిస్ట్ నుంచి ఓ అబద్ధాన్ని తీసేసి ట్వీట్ లో రుద్దేశారు. ఆయన గారి ట్వీట్ల నిర్వాకం ఏ విధంగా వుందో చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత మేము డీమోనిటైజేషన్ చేసామనేది కేంద్రం చెప్పిన మాట. నోట్ల రద్దు సమయంలో నేను ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్నాను. ఆ విషయంపై నన్ను ఎవరూ సంప్రదించలేదన్నది రఘురామ్ రాజన్ మాట. ఈ రెండు ట్వీట్లను జోడిస్తూ ప్రకాష్ రాజ్ నోట్ల రద్దుపై మరోసారి విషం కక్కారు. ఈ ట్వీట్ ద్వారా ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌కు, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మధ్య స్వాభావిక వైరుధ్యం ఉందనే విధంగా నమ్మించడానికి ప్రకాష్ రాజ్ ఈ ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది.

  ఎందుకంటే, నోట్ల రద్దు సమయంలో నిజానికి, ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నది రఘురామ్ రాజన్ కాదు. నోట్ల రద్దు తేదీకి దాదాపు రెండు నెలల ముందు.. ఆయన పదవీ విరమణ తీసుకున్నారు. 2018 నవంబర్ 8న ప్రధాని నోట్ల రద్దు ప్రకటన చేసినప్పుడు ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నది ఉదిత్ ఆర్. పటేల్. ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, రఘురామ్ రాజన్ 2013 సెప్టెంబర్ 4 నుంచి 2016 సెప్టెంబర్ 4 వరకు మాత్రమే RBI గవర్నర్‌గా ఉన్నారు. ఆ తర్వాత డాక్టర్ ఉదిత్ ఆర్ పటేల్ RBI పగ్గాలు చేపట్టారు. అయితే, 2016 ఫిబ్రవరిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంప్రదింపులు జరిపి పెద్ద నోట్ల రద్దును అమలు చేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపింది. వెయ్యి, అయిదు వందల రూపాయల నోట్లు రద్దు చేసే విధానం, రిజర్వ్ బ్యాంకుతో విస్తృతమైన సంప్రదింపులు జరిపిన తరువాత తీసుకున్న నిర్ణయం అని నొక్కి చెప్పింది.

  RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ‘ఐ డూ వాట్ ఐ డూ’ పేరుతో నాన్ ఫిక్షన్ పుస్తకం రాశారు. 2017లో ఈ పుస్తకాన్ని ‘హార్పర్ కాలిన్స్ ఇండియా’ సంస్థ ప్రచురించింది. రాజన్ గవర్నర్‌గా పనిచేసిన సమయంలో చేసిన ప్రసంగాల సమాహారమే ఈ పుస్తకం. ఇందులో నోట్ల రద్దుకు ముందు మోదీ ప్రభుత్వం.. ఆర్బీఐని సంప్రదించడంపై రఘురామ్ రాజన్ చేసిన ప్రకటన కూడా ఉంది. పెద్ద నోట్ల రద్దుపై తన మొత్తం పదవీ కాలంలో ఆర్బీఐ తన అభిప్రాయాన్ని అడగలేదని తన పుస్తకంలో రాసుకున్నాడు. అయితే, 2017 సెప్టెంబర్ లో నోట్ల రద్దుపై తన అభిప్రాయాన్ని చెబుతూ.. 2016 ఫిబ్రవరిలోనే కేంద్రం తన సలహా కోరిందని.. దానికి తాను మౌఖిక సమాధానం ఇచ్చానని చెప్పారు రఘురామ్ రాజన్. వాస్తవాలు ఇలా ఉంటే, ప్రకాష్ రాజ్ మాత్రం ట్వీట్లతో వాస్తవాన్ని వక్రీకరించారు. నిజానిజాలు తెలిసిన నెటిజన్ల నుంచి ఛీత్కారాల సత్కారాలు అందుకుంటున్నారు.

  కారణమేంటో గానీ, ప్రధాని మోదీ అన్నా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమన్నా.. ఎందుకో ప్రకాష్ రాజ్ కు అంతగా గిట్టదు. మోదీపై విమర్శలు చేయడం ప్రకాష్ రాజ్ కు ఇదే తొలిసారి కాదు. ఈ విషయాన్ని తరచూ తన చేష్టల ద్వారా చెప్పేస్తుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉంటారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాలను పొగిడినవారినీ విమర్శిస్తుంటారు. ఇటీవల కాశీలో ఏర్పాట్లపై తమిళ నటుడు విశాల్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించగా, ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారు. ఇప్పుడు నోట్ల రద్దు అంశాన్ని లేవనెత్తారు. పలుమార్లు టీవీ చర్చల్లోనూ ప్రధానిపై ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. ప్రధాని మోదీ, ఆయన చేసే పనులు అందరికీ నచ్చాలని లేదు. వాటిపై విమర్శలు చేసే భావాప్రకటనా స్వేచ్ఛ ఒక భారతీయ పౌరుడిగా ఎవరికైనా ఉంటుంది. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ ను తప్పుబట్టలేం. కానీ, ఎటొచ్చీ, ఆయన అబద్ధాలను నిజాలని నమ్మించే ప్రయత్నం చేయడమే అసలు సమస్య. ఇదంతా చూస్తుంటే మోదీపై ఆయన అక్కసును ఇలా బయటపెడుతున్నారేమో అనిపిస్తుంది.

  Trending Stories

  Related Stories