మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో విజయం సాధించారు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పోలయ్యాయి. మా అసోసియేషన్‌లో మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా, ఈసారి రికార్డు స్థాయిలో 665 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు కారణాల వలన ప్రకాష్ రాజ్ కు ఓట్లు వేయడానికి మా సభ్యులు ముందుకు రాలేదు.
అయితే ఈరోజు ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మా అసోసియేషన్‌కు దూరమైన తెలుగు సినిమాల్లో నటిస్తానని, తెలుగు ప్రేక్షకులకు దూరం కానని అన్నారు. ఒకవేళ విష్ణు సినిమాలో నటించమన్నా నటిస్తానని స్పష్టం చేశారు. మా’ ఎన్నికల్లో ఓటమి అనంతరం సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో తనను నాన్ లోకల్ అంటూ, తెలుగువాడు కాదంటూ చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ప్రాంతీయ వాదం తెరపైకి వచ్చిందని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. మా ఎన్నికల్లో చాలా మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని, వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. ఈ ఎన్నికలు ప్రాంతీయ, జాతీయవాదం భావోద్వేగాల మధ్య జరిగాయని చెప్పుకొచ్చారు. తెలుగు బిడ్డను మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని చెప్పారు. తాను తెలుగు బిడ్డను కాదని.. మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకాశ్ రాజ్ అన్నారు. తన తల్లిదండ్రులు తెలుగువారు కాదని, అది వారి తప్పు కాదని, తన తప్పు కూడా కాదని అన్నారు. తెలుగు వ్యక్తినే ఓటర్లు ఎన్నుకున్నారని తెలిపారు. అతడు మంచి వ్యక్తేనని అన్నారు. అయితే, తనకు ఆత్మగౌరవం ఉంటుందని అందుకే మాకు రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తనకు, ప్రేక్షకులను మధ్య అనుబంధం మాత్రం కొనసాగుతుందని చెప్పారు.
నువ్వు అతిథిగా వచ్చావు.. అతిథిగానే ఉండాలని వచ్చే రోజుల్లో అంటే ఆ అసోసియేషన్‌లో నేను మెంబర్‌గా ఉండకూడదు. మోహన్‌బాబు, కోట శ్రీనివాసరావు, రవిబాబు వంటివారు బహిరంగంగానే అతిథిగా ఉండాలన్నారు. తెలుగోడు కానివాడు ఓటు వేయవచ్చు కానీ అభ్యర్థిగా నిలబడకూడదు అనే నినాదం మొదలుపెట్టారు. వారు అధికారంలోకి వస్తే బైలాస్ మార్చుతామని కూడా చెప్పారు. ఓటమిని జీర్ణించుకోలేక తీసుకున్న నిర్ణయం కాదిదని ప్రకాష్ రాజ్ అన్నారు. జాతీయవాదం, ప్రాంతీయ వాదం నడుమ ‘మా’ ఎన్నికలు జరిగాయి. బండి సంజయ్‌లాంటి వాళ్లు కూడా ట్వీట్ చేశారని ప్రకాష్ రాజ్ అన్నారు.
అంతకు ముందు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారని ఆయన చెప్పారు. అందరికీ అభినందనలు అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానళ్ల విజేతలకు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన మా ఓటర్లకు ధన్యవాదాలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగిందని అన్నారు.