More

    12 ఏళ్ల తర్వాత సొంతూరుకు వచ్చిన ప్రభాస్.. అందరూ తినేసే వెళ్ళాలి

    బీజేపీ నేత, రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ ఈరోజు ఆయన స్వగ్రామమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహిస్తున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు హీరో ప్రభాస్ మొగల్తూరుకు చేరుకున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత తన సొంతూరుకు ప్రభాస్ వచ్చారు. దీంతో ఆయనను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. తన కుటుంబసభ్యులతో కలిసి అభిమానులకు ప్రభాస్ అభివాదం చేశారు. మైక్ తీసుకుని మాట్లాడిన ప్రభాస్ ప్రతి ఒక్కరూ తినేసి వెళ్లాలని కోరారు. ఈ మధ్యాహ్నం అభిమానుల కోసం ప్రభాస్ టీమ్ పెద్ద ఎత్తున భోజన ఏర్పాట్లు చేసింది. దాదాపు లక్ష మంది అభిమానుల కోసం భోజన ఏర్పాట్లు చేశారు. ఆయనకు ఇష్టమైన వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు. 25 రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలను సిద్ధం చేశారు. ముఖ్య అతిథులకు కృష్ణంరాజు ఇంటి ఆవరణలోనే ఏర్పాట్లు చేశారు. ఇతరులకు ఇంటికి దక్షిణం వైపు ఉన్న తోటలో ఏర్పాట్లు చేశారు.

    Trending Stories

    Related Stories