More

    అయోధ్యలో అట్టహాసంగా ఆదిపురుష్ టీజర్ విడుదల

    ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ టీజర్ విడుదలైంది. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన ఈ టీజర్‌ని ఆదివారం సాయంత్రం అయోధ్యలో సరయు నది ఒడ్డున గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఒక నిమిషం 46 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్ ఆకట్టుకుంటూ ఉంటుంది. భూమి కుంగినా నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం అనే డైలాగ్ తో ప్రారంభమైంది. వస్తున్నా! న్యాయం అనే రెండు పాదాలతో పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి.. అంటూ మంచి డైలాగ్స్ తో టీజర్ ఆకట్టుకుంది. రాముడిగా ప్రభాస్ లుక్ ఆకట్టుకుంది. సైఫ్ అలీఖాన్, దేవదత్త నాగె, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

    Trending Stories

    Related Stories