మరో సినిమాను ప్రకటించిన పవన్ కళ్యాణ్

0
741

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల లైనప్ లో మరో సినిమా వచ్చింది. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత హరీష్ శంకర్‌తో భవదీయుడు భగత్‌సింగ్ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు మరో సినిమా.. అది కూడా యంగ్ దర్శకుడితో చేయబోతున్నాడు. సాహో ఫేం దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో పవన్ నటించబోతున్నాడు. ఈ సినిమాపై డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారిక ప్రకటన చేసింది.

ఉదయం 8 గంటల 55 నిమిషాలకు ఈ సినిమా గురించి డీవీవీ బ్యానర్ ట్వీట్ చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో ‘they call him #OG’ అని పేర్కొన్నారు. ఈ పోస్టర్‌లో పవన్ వెనుకవైపు నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఈ మూవీకి రవి.కె.చంద్రన్ కెమెరా మెన్ గా పని చేస్తూ ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ విజయం తరువాత నిర్మాత డీవీవీ దానయ్య నుంచి వస్తున్న సినిమా ఇదే. ఇక త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.