హైదరాబాద్ లో నేటి నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. తాజ్ కృష్ణ హోటల్ లో శని, ఆదివారం ఈ భేటీలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొననున్నారు. శనివారం మధ్యాహ్నం సీడబ్ల్యూసీ సభ్యులకు టీపీసీసీ విందు ఇస్తుంది. విందు అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం సమావేశం అనంతరం బహిరంగ సభ నిర్వహించున్నారు.తెలంగాణ ఎన్నికలే టార్గెట్ గా సీడబ్యూసీ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
అయితే నగరంలో కాంగ్రెస్ కు పోస్టర్లు షాక్ ఇస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు ఎవరెవరైతే స్కామ్ లలో ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో.. వారికి సంబంధించిన వివరాలు ఆ పోస్టర్లలో ఉన్నాయి. హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. “కరప్ట్ వర్కింగ్ కమిటీ” అంటూ హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఈ పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యుల ఫొటోలు, వారు చేసిన స్కాముల వివరాలతో పోస్టర్ లు ఉండడం.. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మొత్తం 24 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలు, వారి స్కాముల వివరాలతో పోస్టర్ లు ఉన్నాయి. బివేర్ ఆఫ్ స్కామర్స్ అంటూ టాగ్ లైన్ లో ఉంది ఆ పోస్టర్లలో..! యూపీఏ హయాంలో జరిగిన స్కాంల గురించి ప్రజలు మరోసారి చర్చించుకుంటూ ఉన్నారు.
పోస్టర్ లో ఉన్న CWC నేతల పేర్లు, వారి స్కాములు:
మల్లికార్జున ఖర్గే – నేషనల్ హెరాల్డ్ స్కాం
సోనియా గాంధీ – నేషనల్ హెరాల్డ్ స్కాం, ఛాపర్ స్కాం
మన్మోహన్ సింగ్ – కోల్ అలోకేషన్ స్కాం
రాహుల్ గాంధీ – నేషనల్ హెరాల్డ్ స్కాం
ఏకే ఆంటోనీ – నేషనల్ హెరాల్డ్ స్కాం
మీరా కుమార్ – నేషనల్ హైవేస్ అథారిటీ స్కాం
దిగ్విజయ్ సింగ్ – రిక్రూట్ మెంట్ స్కాం
చిదంబరం – ఫోర్జరీ, స్టాక్ మార్కెట్ , శారదా చిట్ ఫండ్, వీసా స్కాం
లాల్ థన్ వాలా –మధ్యాహ్న భోజన స్కాం, లాటరీ స్కాం
ముఖుల్ వాస్నిక్ – ఎలక్షన్ టికెట్ స్కాం, ప్రాపర్టీ టాక్స్ స్కాం
ఆనంద్ శర్మ – వాల్ మార్ట్ స్కాం
అశోక్ రావ్ చవాన్ – ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కాం
చరంజిత్ సింగ్ చన్నీ – స్పోర్ట్స్ కిట్, ప్రభుత్వ ఉద్యోగాలు, థీమ్ పార్క్ స్కాం
ప్రియాంక గాంధీ వాద్రా – నేషనల్ హెరాల్గ్ స్కాం,డీఎల్ఎఫ్ లాండ్ స్కాం,
అభిషేక్ మనుసింఘ్వీ – సీడీ రికార్డింగ్ స్కాం
జైరాం రమేష్ – కోల్ స్కాం
మహేంద్రజీత్ సింగ్ మాల్వియా –అసిస్టెంట్ ఇంజినీర్స్ ట్రాన్స్ ఫర్ స్కాం
కేసీ వేణుగోపాల్ – సోలార్ స్కాం
అధిర్ రంజన్ చౌదరి – శారదా స్కాం
అంబికా సోని – రైల్వే వాటర్ బాటిల్స్ స్కాం
అజయ్ మాకెన్ – రియల్ ఎస్టేట్ స్కాం
తామ్రద్వజ్ సాహు – ఆవు పేడ స్కాం
సల్మాన్ ఖుర్షీద్ – వీల్ చెయిర్ స్కాం
శశిథరూర్ – స్పాట్ ఫిక్సింగ్ స్కాం