More

    పోసానికి కీలక పదవిని ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

    ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా టాలీవుడ్ ప్రముఖ నటుడు, కథా రచయిత పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పోసాని నియామకానికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ సిద్ధాంతాలను, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పోసాని మొదటి నుండి ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే..! ఆయన సేవలను గుర్తించి ఈ పదవిని అప్పజెప్పారని చెబుతున్నారు. ఇప్పటికే హాస్య నటుడు అలీని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నియమించింది. ఇప్పుడు పోసానికి కూడా కీలక పదవి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    Trending Stories

    Related Stories