పోర్న్ వీడియోలకు అలవాటు పడ్డ జషీర్ పాషా భార్యను అతి దారుణంగా హత్య

0
1006

ఆదివారం నాడు 40 ఏళ్ల వ్యక్తి తన భార్యను పోర్న్ సినిమాల్లో నటించిందని భావించి హత్య చేసినట్లు ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ఈ ఘటన కర్ణాటకలోని రామనగర ప్రాంతంలో చోటుచేసుకుంది. నిందితుడిని జషీర్ పాషాగా గుర్తించారు. పోర్న్ కు అలవాటు పడిన పాషా వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. నిందితుడు రెండు నెలల క్రితం ఓ పోర్న్ ఫిల్మ్ చూశాడని, ఆ క్లిప్‌లోని మహిళ తన భార్య అని భావించడం.. అనుమానించడం మొదలు పెట్టాడని న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

అనుమానం పెరగడంతో పాషా భార్యను వేధించడం ప్రారంభించాడు. భార్యపై నమ్మకం లేదని, ఆమెపై శారీరకంగా దాడి చేయడం ప్రారంభించాడు. 2 నెలల క్రితం కోలార్‌లో జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో కూడా పాషా తన భార్యను దారుణంగా కొట్టాడు. దీంతో పలువురు కుటుంబ సభ్యులకు అతనిపై అనుమానం వచ్చింది. మార్చి చివరిలో కూడా పాషా మళ్లీ తన భార్యను కొట్టాడు. ఈ దాడుల్లో 35 ఏళ్ల ముబీనా తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చేరింది. ఆదివారం (ఏప్రిల్ 17) 12:30 గంటల సమయంలో వారి నివాసంలోనే తన పిల్లల ముందే పాషా ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు.

ఈ ఘటన గురించి ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ “గతంలో ఆమె తండ్రి పోలీసులను సంప్రదించారు, కానీ ముబీనా తండ్రిని ఫిర్యాదు చేయకుండా ఆపింది. ఈ ఘటనకు నాలుగు రోజుల ముందు దంపతులు నగరంలోనే ఉండి రామనగర్‌కు వెళ్లారు. ఆదివారం 12.40 గంటలకు, దంపతుల మొదటి కుమారుడు సమీపంలో ఉన్న తన తాత గౌస్ పాషా నివాసానికి పరుగెత్తాడు. తల్లిని వారి తండ్రి కత్తితో పొడిచినట్లు అతనికి చెప్పాడు” అని తెలిపారు. విషయం తెలుసుకుని గౌస్ పాషా ఇంటికి పరుగెత్తాడు.. అప్పటికే ముబీనా చనిపోయింది. నిందితుడు బెంగళూరులోని షమ్మన్న గార్డెన్‌కు చెందిన వ్యక్తి కాగా, బాధితురాలు బెంగళూరులోని బీఎం రోడ్డులోని రెహమానియానగర్‌కు చెందినది.