ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన దేశ వ్యాప్త పాదయాత్రను నేడు మొదలైంది. పశ్చిమ చంపారన్ జిల్లా నుండి తన 3,500 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర అతని తాజా రాజకీయ ప్రవేశానికి నాందిగా ప్రచారం సాగుతోంది. ‘జన్ సురాజ్’ ప్రచారంలో భాగంగా ఈ యాత్ర చేస్తారు. బీహార్ లోని తూర్పు చంపారన్ జిల్లా నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగనుంది. కిషోర్ బిహార్ రాష్ట్ర రాజకీయాల్లో మంచి పట్టు సాధించడానికే ఈ యాత్ర అంటూ చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నేతలను గుర్తించటం, వారిని ప్రోత్సహించడం, పలు రంగాల్లోని నిపుణుల ఆలోచనలను అమలు చేసేలా విధానాలు రూపొందించడం వంటివి ప్రశాంత్ కిశోర్ ప్రణాళికల్లో ఉన్నాయి.
ఒకప్పుడు JD(U) పార్టీలో ఉన్న కిషోర్, రాష్ట్రంలో మారుతున్న కూటములకు సంబంధించి నితీష్ కుమార్ ప్రభుత్వంపై తన వంతు దాడి చేస్తున్నారు. “నితీష్ కుమార్‌పై నా అతిపెద్ద విమర్శ ఏమిటంటే, విద్యావంతుడు అయినప్పటికీ అతని పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా పతనమైపోయింది. మాకు ప్రాథమిక పాఠశాలలు ఉండేవి, అవి ఇప్పుడు కూలిపోయాయి. ఒక్కో జిల్లాలో కనీసం రెండు మూడు ప్రభుత్వ పాఠశాలలు చాలా మంచివి ఉండేవి. ఇప్పుడు అలాంటివేవీ మా దగ్గర లేవు” అని కిషోర్ చెప్పారు. బిహార్‌లో నితీష్ కుమార్‌పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కిషోర్ అన్నారు.