More

    హఫీజ్ సయీద్ బిలాల్ ను పట్టుకున్న పోలీసులు.. టీవీ నటిని కాపాడారు

    శుక్రవారం, పనాజీ సమీపంలోని సంగోల్డా గ్రామంలో హైప్రొఫైల్ వ్యభిచార రాకెట్ నడుపుతున్న హైదరాబాద్‌కు చెందిన హఫీజ్ సయ్యద్ బిలాల్‌ను గోవా పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్రకు చెందిన ముగ్గురు మహిళలను రక్షించారు. రక్షించబడిన మహిళల్లో ఒకరు ప్రముఖ టెలివిజన్ ఆర్టిస్ట్. నిందితుడిని పట్టుకునేందుకు గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 26 ఏళ్ల హఫీజ్ సయ్యద్ బిలాల్ సెక్స్ రాకెట్‌ ను నడుపుతున్నట్లు ఇప్పటికే సమాచారం అందుకున్నారు.

    పోలీసులు నకిలీ కస్టమర్‌ను ఏర్పాటు చేసి బిలాల్‌ను సంప్రదించారు. మహిళలను సరఫరా చేయమని అడిగారు. రూ. 50,000 బేరం కుదుర్చుకున్నాక సంగోల్డాలోని ఒక ప్రముఖ హోటల్ దగ్గరకు ముగ్గురు మహిళలను పంపేందుకు బిలాల్ అంగీకరించాడు. ఆ సమయంలో నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని మహిళలను రక్షించారు. రక్షించబడిన ముగ్గురు మహిళలు 30-40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు. జార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్రలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు ముంబై సమీపంలోని విరార్‌కు చెందిన ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ అని తెలుస్తోంది. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ప్రకారం పలు సెక్షన్స్ కింద అతడిపై కేసులను నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచార సేవలను కోరడం, హోటళ్లలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడం, వ్యభిచార గృహానికి యజమానిగా ఉండటం, సెక్స్ వర్కర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా వ్యభిచారం చేయించడం, కస్టమర్‌తో లైంగిక చర్యను ఏర్పాటు చేయడం వంటి అభియోగాలు అతడిపై మోపబడ్డాయి.

    గత ఏడాది నవంబర్‌లో అంజునా పోలీసులు అర్పోరా వద్ద వ్యభిచార రాకెట్‌ను ఛేదించి, మహారాష్ట్రకు చెందిన నలుగురు మహిళలను రక్షించారు. ఆ తర్వాత మహిళలను మెర్సెస్‌లోని రక్షిత గృహాలకు పంపారు. గత ఏడాది అక్టోబర్‌లో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన హీనా పఠాన్‌తో పాటు హర్యానాకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులను గోవాలో పోలీసులు అరెస్టు చేశారు. నివేదికల ప్రకారం, ముగ్గురూ కోల్వాలోని గెస్ట్ హౌస్‌లో సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్నారు. బాధితుల సంపాదనతో జీవిస్తున్నారు. ప్రస్తుత కేసులో హఫీజ్ సయ్యద్ బిలాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను నేరం అంగీకరించాడని తెలుస్తోంది. మరింత విచారణ చేస్తూ ఉన్నారు.

    Trending Stories

    Related Stories