Telugu States

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కాల్పులు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనకారులు రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులపై రాళ్లదాడికి దిగారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తూ పాత విధానంలోనే సైనిక నియమాకాలను చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. రైల్వే ప్లాట్ ఫామ్ మొత్తాన్ని పోలీసులు ఖాళీ చేయించారు. భారీగా అదనపు బలగాలను తరలిస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 15 రౌండ్లు కాల్పులు జరిపారని తెలుస్తోంది. ఈ ఘటనలో కొందరు విద్యార్థులు గాయపడ్డారు. కాల్పుల్లో గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళన కారులు నాలుగు రైళ్లకు నిప్పు పెట్టారు. వేలాది మంది యువకులు రైలు పట్టాలపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. సికింద్రాబాద్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పు పెట్టారు.

Related Articles

Back to top button