Telugu States

హైదరాబాద్ మాజీ మేయర్, ఎంఐఎం నేత మాజిద్ హుస్సేన్ పై రెండు కేసులు

మరో ఎంఐఎం నేత రెచ్చిపోయాడు. హైదరాబాద్ పోలీసుల మీదకు కూడా దూకుడుగా వెళ్ళాడు. తనను ఎవరూ ఏమీ చేయలేరన్న ధైర్యమో.. లేక మరేదైనా కారణమో కానీ హైదరాబాద్ మాజీ మేయర్, ఎంఐఎం నేత మాజిద్ హుస్సేన్ వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. ప్రస్తుతానికి మాజిద్ హుస్సేన్ పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఓ భూవివాదం కేసులో మాజిద్ హుస్సేన్ జోక్యం చేసుకోవడంతో రచ్చ మొదలైందని తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుండటంతో పోలీసులు అక్కడకు చేరుకుని, సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులపై కూడా మాజిద్ దూకుడుగా వ్యవహరించడం వివాదాస్పదమైంది. దీంతో మాజిద్ హుస్సేన్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిలింనగర్‌లో భూవివాదం విషయంలో నిఖిల్ రెడ్డి అనే వ్యక్తిపై ఎంఐఎం పార్టీకి చెందిన మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్‌పై పోలీసుల ఎదుటే బెదిరింపులకు దిగారు. నచ్చ చెప్పేందుకు ప్రయత్నించిన పోలీసు పైనే మాజిద్ దురుసుగా ప్రవర్తించారట. అడ్డుకున్న పోలీసులపై మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ అసభ్యకర రీతిలో వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. ఎంఐఎం నేతలకు చట్టం చుట్టమా అనే విమర్శలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేసిన పోలీసులు.. విధులకు ఆటంకం కలిగించారంటూ ఎస్‌ఐ రవిరాజ్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మాజిద్ పై బంజారాహిల్స్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. భూవివాదంలో నిఖిల్ రెడ్డి అనే వ్యక్తిని బెదిరించినందుకు ఒక కేసు, పోలీసులను దుర్భాషలాడినందుకు మరో కేసు పెట్టామని బంజారా హిల్స్ పోలీసులు వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − fifteen =

Back to top button