మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితిలో ఉండగా.. సీఎం పదవి నుంచి వైదొలగేందుకు థాకరే సిద్ధమయ్యారు. సీఎం అధికారిక నివాసం ‘వర్ష’ను ఆయన ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా శివసేన కార్యకర్తలు ఆయనపై పూలు చల్లారు. అయితే ఉద్ధవ్ థాకరేపై బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యదర్శి తజిందర్ పాల్ సింగ్ బగ్గా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరోనా బారిన పడిన ఉద్ధవ్ థాకరే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని ఫిర్యాదులో బగ్గా పేర్కొన్నారు. ఐసొలేషన్ లో ఉండకుండా, భౌతికదూరం పాటించకుండా ప్రజల మధ్యకు వచ్చారని తెలిపారు. సీఎం అధికారిక నివాసం నుంచి తన నివాసం ‘మాతోశ్రీ’కి చేరుకున్న తర్వాత కూడా వందల మంది మద్దతుదారులతో భేటీ నిర్వహించారని చెప్పారు. సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకు కరోనా వైరస్ సంక్రమించింది. ఉద్దవ్ నేతృత్వంలోని మహా వికాశ్ అవధి కూటమి మైనార్టీలో పడింది. సంక్షోభంపై ఉద్దవ్‌తో చర్చించేందుకు కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ ప్రయత్నించగా.. ఉద్దవ్ కోవిడ్ పాజిటివ్ అని, దాని వల్లే ఆయన్ను కలవలేకపోయినట్లు కమల్‌నాథ్ తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారికి కూడా కరోనా వైరస్ సంక్రమించింది. రిలయన్స్ ట్రస్ట్ హాస్పిటల్‌లో ఆయన చేరారు.