More

  కేసీఆర్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నేతలు ఫిర్యాదు చేశారు. హిందూ దేవతలను కించపరుస్తూ కేసీఆర్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో ఉన్న ప్రముఖ దేవతలను కీర్తించారని.. దీనిని రాజకీయంగా తప్పు పడుతూ ఆదివారం (జూలై 10) నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ హిందూ దేవతలను కించపరిచేలా వ్యాఖ్యానించారని వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నాయకులు ఆరోపించారు.

  భజరంగ్ దళ్ నేత అభిషేక్ మాట్లాడుతూ, ఈ నెల 10వ తేదీన నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేసీఆర్ మాట్లాడుతూ హిందూ దేవతలను విమర్శించారని చెప్పారు. కేసీఆర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ తెలంగాణలో ఉన్న దేవతలను కీర్తించారని తెలిపారు. కేసీఆర్ మాత్రం హిందూ దేవతలను కించపరిచారని చెప్పారు.

  spot_img

  Trending Stories

  Related Stories