More

    సాయి పల్లవిపై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు

    సినీ నటి సాయిపల్లవి ఇబ్బందుల్లో పడింది. కశ్మీర్ పండిట్ల ఊచకోత అంశాన్ని, ఆవులను రవాణా చేస్తున్న వ్యక్తులపై దాడి గురించి వ్యాఖ్యలు చేసిన సాయిపల్లవిపై హైదరాబాదు పోలీసులకు ఫిర్యాదు అందింది. కశ్మీర్ ఫైల్స్ సినిమా, గోరక్షకులపై సాయిపల్లవి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ భజరంగ్ దళ్ నేతలు సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాయిపల్లవిపై చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయ సలహా తీసుకున్న మీదట సాయిపల్లవిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

    Related Stories