InternationalNational

మెహుల్ చోక్సీ మాయం..!
ఆంటిగ్వాలో ఏం జరుగుతోంది..?

Fugitive Diamantaire Mehul Choksi Missing In Antigua

బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తోడుదొంగ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ అదృశ్యమయ్యాడు. అంటిగ్వా దీవిలో ఉంటున్న చోక్సీ అదృశ్యమైనట్టు లాయర్ విజయ్ అగర్వాల్ వెల్లడించారు. అక్కడి రెస్టారెంట్‌లో ఈ నెల 24 సాయంత్రం విందు కోసం వెళ్ళిన ఆయన తర్వాత ఉన్నట్టుండి మాయమయ్యాడు. ఆయన వాహనాన్ని రెస్టారెంట్ సమీపంలోని జాలీ హార్బర్‌లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అంటిగ్వా పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు.

2018లో పీఎన్‌బీ కుంభకోణం బయటపడడంతో నీరవ్‌మోదీ, మెహుల్‌ చోక్సీ దేశం విడిచి పరారయ్యాడు. నీరవ్ ప్రస్తుతం బ్రిటన్‌ జైల్లో ఉన్నాడు. గీతాంజలి జ్యువెలర్ గ్రూప్ అధినేత అయిన మెహుల్ చోక్సీ కోసం సీబీఐ, ఈడీలు గాలిస్తున్నాయి. మొత్తం 13,578 కోట్ల పీఎన్‌బీ కుంభకోణం కేసులో చోక్సీ 7,080 కోట్లు మేర అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి నెల రోజుల ముందే 2018 జనవరి 4 అంటిగ్వాకు చెక్కేశారు. అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ కాగా.. 2013లో స్టాక్ మార్కెట్ మోసం కేసులోనూ ఆరోపణలు ఉన్నాయి. చోక్సీ కేవలం భారతీయ బ్యాంకులనే కాదు, దుబాయ్, అమెరికాలకు చెందిన వ్యాపారులు, కస్టమర్లను మోసం చేసినట్టు ఈడీ ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. అతడికి చెందిన 2,500 కోట్ల ఆస్తులను ఇప్పటికే జప్తు చేశారు.

2017లో మెహుల్ చోక్సీకి ఆంటిగ్వా ప్రభుత్వం పౌరసత్వం కల్పించింది. అయితే, ఓ ఆర్థిక నేరగాడికి పౌరసత్వం ఎలా కల్పిస్తారంటూ భారత్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆంటిగ్వా ప్రభుత్వం దిగివచ్చింది. ఈ ఏడాది మార్చిలో మెహుల్ చోక్సీ పౌరసత్వాన్ని రద్దుచేసింది. త్వరలోనే అతన్ని భారత్ కు అప్పగిస్తామని చెప్పింది ఆంటిగ్వా ప్రభుత్వం. అయితే, ఆంటిగ్వా ప్రభుత్వ నిర్ణయాన్ని చోక్సీ కోర్టులో సవాల్ చేశారు. అయితే, ఆ కేసు విచారణలో వుండగానే.. సడెన్ గా అతను కనిపించకుండా పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అతని బార్బుడా పౌరసత్వం కూడా వుండటంతో.. ఆంటిగ్వా నుంచి బార్బుడాకు పారిపోయాడనే అనుమానాలు కూడా వున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × four =

Back to top button