ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు అత్యంత సమీపంలో ఎగిరిన నలుపు రంగు బెలూన్స్

0
740

ప్రధాని మోదీ ఏపీ పర్యటన సందర్భంగా ఇంటెలిజెన్స్ వైఫల్యం బయటపడింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి భీమవరంకు మోదీ, జగన్ వెళ్తుండగా కాంగ్రెస్ శ్రేణులు డజన్ల కొద్ది ఎయిర్ బెలూన్లను గాల్లోకి వదిలాయి. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ నేతృత్వంలో బెలూన్లను యువకులు వదిలినట్టు సమాచారం. బెలూన్లను ఎగురవేసిన ఘటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, కొన్ని దుష్టశక్తులు బెలూన్లను ఎగురవేశాయని మండిపడ్డారు. నల్ల బెలూన్లను గాల్లోకి పంపడం ద్వారా భార కుట్రకు పాల్పడ్డారని అన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరపాలని దుష్ట శక్తులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రధాని ప్రయాణించే మార్గంలో బెలూన్లు ప్రత్యక్షం కావడాన్ని సెక్యూరిటీ లోపంగా పరిగణిస్తూ కేంద్రం సీరియస్ గా తీసుకొన్నట్లు సమాచారం. విజయవాడ సమీపంలోని ఓ కన్ట్రక్షన్ బిల్డింగ్ పై నుండి ఈ బెలూన్లు ఎగరేసినట్లు సమాచారం. బెలూన్లు ఎగరవేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీతో పాటు మరో ముగ్గురు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ విజయ్ పాల్ తెలిపారు.