More

    చైనాను దాటేసిన భారత్.. లావాదేవీల్లో భారీగా మార్పులు

    పటిష్టమైన డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బ్యాంక్ బ్రాంచ్‌లను జాగ్రత్తగా రీకాలిబ్రేషన్ చేయడం, మొబైల్ లావాదేవీల పెరుగుదల మరియు బ్యాంక్ శాఖల సంఖ్య పెరగడం వల్ల భారతదేశ ఆర్థిక లావాదేవీలు ఎంతో బాగా మెరుగుపడిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆర్థికవేత్తల నివేదిక తెలిపింది. “భారతదేశంలో 2014 నుండి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఖాతాల ప్రారంభంతో ఆర్థిక లావాదేవీల్లో మార్పు మొదలైందని.. ఆర్థిక చేరికను మరింతగా పెంచడానికి బ్యాంకింగ్ కరస్పాండెంట్ నమూనాను తెలివిగా ఉపయోగిస్తుంది” అని నివేదిక పేర్కొంది. బ్యాంకింగ్ కరస్పాండెంట్ మోడల్ తక్కువ ధరకు నిర్దిష్ట శ్రేణి బ్యాంకింగ్ సేవలను అందించడానికి వీలు కల్పించిందని మరియు ఆర్థిక చేరిక(financial inclusion) ను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుందని కూడా పేర్కొంది. ఆర్థికంగా లావాదేవీల్లో కూడా చైనాను భారత్‌ అధిగమించింది.

    ఆర్థిక చేరికలో ఏమున్నది:
    వ్యాపారాలు మరియు వ్యక్తులు ఉపయోగకరమైన మరియు సరసమైన ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవలకు ఉన్న పరిస్థితిని ప్రపంచ బ్యాంక్ ఆర్థిక చేరికగా నిర్వచిస్తుంది. ఒక వ్యక్తి లావాదేవీని నిర్వహించగల బ్యాంక్ ఖాతాకు సులభంగా యాక్సెస్ కలిగి ఉండటం అనేది విస్తృత ఆర్థిక చేరికకు మొదటి అడుగుగా భావిస్తారు. అందులో భారత్ గత కొన్నేళ్లలో మరింత ముందుకు వెళ్ళింది.

    భారతదేశంలో మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు 2015లో ప్రతి 1000 మందికి 183 మాత్రమే నమోదు కాగా.. 2020లో ఇవి 13615కు పెరిగాయి. డిపాజిట్‌ ఖాతాలు సైతం 1536 నుంచి 2031కు చేరాయి. రుణ ఖాతాలు కూడా 154 నుంచి 267కు పెరిగాయి. ఇక బ్యాంకు శాఖలు కూడా ప్రతి లక్ష మందికి 2015లో 13.6గా ఉండగా, అవి 2020 కల్లా 14.7కు చేరాయి. జర్మనీ, చైనా, దక్షిణాఫ్రికాల కంటే అధికమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక చెబుతోంది. గ్రామాల్లో బ్యాంకింగ్‌ అవుట్‌లెట్లు /బ్యాంకింగ్‌ కరెస్పాండెంట్లు(బీసీలు) మార్చి 2010లో 34,174గా ఉండగా డిసెంబరు 2020కి 12.4 లక్షలకు చేరారు. ఆర్థిక సంఘటితం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో నేరాలు తగ్గడం, ఆల్కహాల్‌, పొగాకు వాడకం కూడా దిగివచ్చాయని పెద్ద నోట్ల రద్దుకు అయిదేళ్లయిన సందర్భంగా రూపొందించిన నివేదికలో ఎస్‌బీఐ గ్రూప్‌ చీఫ్‌ ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ తెలిపారు. సున్నా బ్యాలెన్స్‌ ఖాతాల పథకం కింద బ్యాంకుల్లో తెరచిన డిపాజిట్‌ ఖాతాల సంఖ్య కొన్ని అభివృద్ధి చెందిన దేశాలకంటే కూడా ఎక్కువగా నమోదైంది. గత ఏడేళ్ల ఆర్థిక సంఘటిత కార్యక్రమంలో సున్నా బ్యాలెన్స్‌ ఖాతాలు 43.7 కోట్లకు చేరగా.. అందులో జమ అయిన నగదు రూ.1.46 లక్షల కోట్లుగా నమోదైంది. అక్టోబరు 20, 2021 నాటికి ఈ స్థాయికి చేరింది. మూడింట రెండొంతులు గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. 78 శాతం సున్నా బ్యాలెన్స్‌ ఖాతాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనివే. 18.2% ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోనివి కాగా. కేవలం 3 శాతం ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ తరహా ఖాతాలను 34 కోట్ల మేర తెరవగా.. ప్రైవేటు రంగ బ్యాంకులు 1.3 కోట్లు మాత్రమే తెరిచాయి. మార్చి 2010లో బ్యాంకు శాఖలు 33,378 ఉండగా.. డిసెంబరు 2020 కల్లా అవి 55,073కు చేరాయి.

    Trending Stories

    Related Stories