ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పర్యటనలో భ‌ద్రతాలోపంపై విచారణ జరిపేది వీరే

0
1096

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ భ‌ద్రతాలోపంపై విచార‌ణ చేప‌ట్టేందుకు సుప్రీంకోర్టు స్వ‌తంత్ర క‌మిటీని ఏర్పాటు చేసింది. పంజాబ్ పర్యటనలో భద్రతాలోపంపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ కమిటీని నియమించింది. రిటైర్డ్ జడ్జి ఇందు మల్హోత్రా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పూర్తిస్థాయిలో విచారించి భద్రత లోపాలకు గల కారణాలు, ఎవరి వైఫల్యం వంటి విషయాలను విచారించనుంది. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఛండీఘడ్ డీజీపీ, ఏఎన్ఐ ఐజీ , పంజాబ్ సెక్యూరిటీ ఐజీ సభ్యులుగా ఉంటారని ఇదివరకే సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఇందు మ‌ల్హోత్రాను ఈ క‌మిటీకి హెడ్‌గా నియ‌మించింది. క‌మిటీలో నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్, పంజాబ్ సెక్యూరిటీ డీజీపీ, పంజాబ్‌-హ‌ర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్‌లు, చండీగ‌ఢ్ డీజీపీ ఈ క‌మిటీలో స‌భ్యులుగా ఉన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనవరి 05న పంజాబ్‌ పర్యటన సందర్భంగా భద్రతా లోపాలపై దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేయడంపై సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఇందు మల్హోత్రాను ప్యానెల్‌కు నేతృత్వం వహించనున్నారు. భద్రతా ఉల్లంఘనకు గల కారణాలు, దానికి బాధ్యులైన వ్యక్తులపై దర్యాప్తు చేయాలని, భవిష్యత్తులో వీవీఐపీల భద్రతా లోపాలను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలను రూపొందించాలని సుప్రీంకోర్టు ప్యానెల్‌ను ఆదేశించింది.

జనవరి 10న, ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ అంశంపై దర్యాప్తు చేయడానికి స్వతంత్ర జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని స్వతంత్ర దర్యాప్తులపై స్టే విధించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ అధ్యక్షతన, జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం “లాయర్స్ వాయిస్” సంస్థ చేసిన పిటిషన్‌ను విచారించింది. ప్రధానమంత్రి పంజాబ్‌లో భద్రతా ఉల్లంఘన జరిగినప్పుడు దానికి సంబంధించిన రికార్డులను రక్షించాలని, అలాగే భద్రపరచాలని జనవరి 7న పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ నెల 5న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో బీజేపీ ప్ర‌చార‌స‌భ‌లో పాల్గొనేందుకు ప్ర‌ధాని వెళ్లారు. రోడ్డు మార్గాన ఫిరోజ్‌పూర్‌కు వెళ్తుండ‌గా కొంద‌రు ఆయ‌న కాన్వాయ్‌కు అడ్డుప‌డ్డారు. ప్ర‌ధాని మోదీకి, కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. దాంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు 20 నిమిషాల‌పాటు ప్ర‌ధాని రోడ్డుపై వేచివున్నా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేయ‌లేక పోయారు. ప్ర‌ధానికి భ‌ద్ర‌తాలోపం త‌లెత్త‌డాన్ని కేంద్రం సీరియ‌స్‌గా తీసుకుంది. సెక్యూరిటీ ఇవ్వ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం, పోలీసులు విఫ‌ల‌మ‌య్యార‌ని ఆరోపించింది. పంజాబ్ డీజేపీ స‌హా కొంద‌రు పోలీసులను ఈ ఘ‌ట‌న‌కు బాధ్యుల‌ను చేస్తూ స‌స్పెండ్ చేయడం కూడా జరిగింది.