More

    తల్లికి పాదపూజ చేసిన ప్రధాని మోదీ..!

    భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఈరోజు 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తన తల్లిని మోదీ కలిశారు. ఈ ఉదయం గాంధీనగర్ లోని తన తల్లి నివాసానికి ఆయన వెళ్లారు. తన తల్లికి పాదపూజ చేసి, ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమెకు స్వీట్ తినిపించారు. ప్రస్తుతం మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. పంచమహల్ జిల్లాలోని ప్రముఖ ఆథ్యాత్మిక కేంద్రం పావగఢ్ ను ఆయన సందర్శించనున్నారు.

    “ఈరోజు, మా అమ్మ శ్రీమతి హీరాబా తన వందో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారనే విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా, అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఆమె శత జయంతి సంవత్సరం. మా నాన్న జీవించి ఉంటే, ఆయన కూడా గత వారం తన 100వ పుట్టినరోజు జరుపుకునేవారు” అని ప్రధాన మంత్రి తన లేఖలో రాశారు. వడోదరలో ర్యాలీలో ప్రసంగించే ముందు ప్రధాని మోదీ పావగఢ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆయన తల్లి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని స్వస్థలం వాద్‌నగర్‌లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించారు. మోదీ కుటుంబం అహ్మదాబాద్‌లోని జగన్నాథ ఆలయంలో అన్నదానం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. హీరాబెన్ మోదీ గాంధీనగర్ శివార్లలోని రైసన్ గ్రామంలో ప్రధాని తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి నివసిస్తున్నారు. ప్రధాని మోదీ చివరిసారిగా మార్చిలో తన తల్లిని సందర్శించారు.

    spot_img

    Trending Stories

    Related Stories