More

  తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం తథ్యం: ప్రధాని మోదీ

  సికింద్రాబాద్ లో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసమే తాను ఇక్కడికి వచ్చానని.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. అలా జరిగినప్పుడే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఆవిష్కరణల పరంగా తెలంగాణ దేశానికే కేంద్రంగా మారిందని.. తెలంగాణ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో రూ.35 వేల కోట్ల నిధులతో ఐదు భారీ ప్రాజెక్టులు చేపట్టామని, తమ హయాంలో తెలంగాణలో జాతీయ రహదారులు రెండు రెట్లు పెరిగాయని వివరించారు. తమ పాలనలో గ్రామీణ యువతను ప్రోత్సహిస్తున్నామని, తెలంగాణ రైతాంగానికి లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పంటల కనీస మద్దతు ధర పెంచామని స్పష్టం చేశారు. తెలంగాణలో మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

  తెలంగాణా బీజేపీని ఆశీర్వదించేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులకు మాతృమూర్తులకు ప్రతి ఒక్కరికీ నా నమస్కారం అంటూ ప్రధాని మొదట తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించడం విశేషం. తెలంగాణలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను నిర్మిస్తామని మోదీ చెప్పారు. బడుగు బలహీన వర్గాల కోసం బీజేపీ ఎంతో కృషి చేస్తోందని చెప్పారు మోదీ. సబ్‌ కా సాథ్‌, సబ్‌కా వికాస్‌ కోసం పనిచేస్తున్నామన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించామని, బీజేపీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం మరింత పెరిగిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తోందని గత ఎనిమిదేళ్లలో ప్రతి భారతీయుడికి మంచి చేసే ప్రయత్నం చేశామని మోదీ వివరించారు. దశాబ్దాల నుంచి వంచనకు గురైన వాళ్ల అభివృద్ధి కోసం పనిచేశామన్నారు.

  spot_img

  Trending Stories

  Related Stories