బేగంపేటకు చేరుకున్న ప్రధాని మోదీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరం

0
722

భారత ప్రధాని మోదీ హైదరాబాదులోని బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ కు వచ్చారు. ఎయిర్ పోర్టులో ఆయనకు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే రఘునందన్, బీజేపీ నేతలు రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి, డీకే అరుణ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట ఎయిర్ పోర్ట్ బయట ఏర్పాటు చేసిన సభ వేదికపైకి ప్రధాని చేరుకున్నారు.

ప్రధాని మోదీ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి దూరమయ్యారు. విమానాశ్రయంలో ప్రభుత్వం తరపున స్వాగతం పలికేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చారు. మోదీ తిరుగుపయనం అయ్యేటప్పుడు కూడా తలసానే వీడ్కోలు పలకనున్నారు.