భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరిన ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట్ ఎయిర్ పోర్ట్కు చేరుకున్నారు. షెడ్యుల్ కంటే మోదీ 10 నిమిషాలు ఆలస్యంగా మోదీ హైదరాబాద్ కు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మోదీకి స్వాగతం పలికేందుకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లారు.
హైదరాబాద్ చేరుకున్న నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. గవర్నర్ తమిళసైతో పాటు ఇతర బీజేపీ నాయకులు ఆహ్వానిస్తున్న ఫొటోలను ఆయన షేర్ చేశారు. ‘డైనమిక్ సిటీ హైదరాబాద్లో జరుగుతున్న బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తాం’ అని రాసుకొచ్చారు.