More

    ఏపీకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

    ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట నుంచి ఏపీ లోని గన్నవరం చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఎంఐ–17 ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళతారు. 11 గంటలకు ఏఎస్‌ఆర్‌ పార్కులో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఒకే హెలికాప్టర్‌లో ప్రధాని, గవర్నర్‌, సీఎం భీమవరం బయలుదేరారు.

    ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా భీమవరం సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో నిర్వహిస్తున్న అల్లూరి జయంతి వేడుకలో ప్రధాని పాల్గొంటారు. క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని వర్చువల్ గా ఆవిష్కరిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భీమవరంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, క్షత్రీయ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి 125వ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ప్రధాన వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మరికొద్దిమంది ఉంటారు.

    spot_img

    Trending Stories

    Related Stories