ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వీడ్కోలు విందు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముతో పాటు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పద్మ అవార్డు గ్రహీత మొగిలయ్య, గిరిజన నేతలు పాల్గొన్నారు. హోటల్ అశోకాలో జరిగిన ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురితోపాటు 18 పార్టీల నేతలు కూడా ఉన్నారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు సభకు అందరికీ ఆహ్వానం ప్రధాని కార్యాలయం పంపింది. బీజేపీ ముఖ్యమంత్రలు మినహా ఎవరూ హాజరు కాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం పంపలేదు.. అదే సమయంలో యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికిన తమిళనాడు ముఖ్యమంత్రికి ఆహ్వానం అందింది. ఆహ్వానం అందినా ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రులు ఈ వీడ్కోలు సభకు హాజరు కాలేదు. ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. ఈ విందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఇందులో పాల్గొన్నారు. విపక్ష నేతగా ఉన్న గులాంనబీ ఆజాద్, అథీర్ రంజన్ చౌధురి కూడా ఈ విందుకు హాజరయ్యారు.