More

    బానిసత్వంలో భారతీయత అనే భావన గాయపడింది.. ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ గెలిచాం

    స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతోందని, ఈ అమృత మహోత్సవం వేళ భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. ఈ వేళ మనకు త్యాగధనుల బలిదానాలను స్మరించుకునే అదృష్టం కలిగిందన్నారు. బానిస సంకెళ్ల నుంచి దేశానికి స్వేచ్ఛను అందించేందుకు అమరవీరులు చేసిన పోరాటం అసాధారణమని అన్నారు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ వంటి వారు మనకు మార్గదర్శకులన్నారు. మహనీయుల తిరుగుబాట్లే మనకు స్ఫూర్తి అని.. దేశం కోసం ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను త్యజించారన్నారు. బానిసత్వంలో భారతీయత అనే భావన గాయపడిందని, ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ దేశం నిలిచి గెలిచిందన్నారు. మూలాలు బలంగా ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగగలమని అన్నారు. మహాత్ముని ఆశయాలకు, భారతీయులందరి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్రాలు ప్రజల ఆశలను సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపును ఇచ్చారు.

    spot_img

    Trending Stories

    Related Stories