More

    అయోధ్య భారత సంస్కృతి, సంప్రదాయాలకు సర్వోన్నత ప్రతీకలా నిలవాలి: మోదీ

    హిందూ బంధువులు ఎంతో ఆత్రుతగా రామ మందిరం నిర్మాణం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. రామమందిరం నిర్మితమవుతున్న అయోధ్య అభివృద్ధి ప్రణాళికపై ప్రధాని నరేంద్ర మోదీ నేడు సమీక్ష నిర్వహించారు. మోదీ మాట్లాడుతూ అయోధ్య భారత సంస్కృతి, సంప్రదాయాలకు సర్వోన్నత ప్రతీకలా నిలవాలని ఆకాంక్షించారు. జీవితంలో ఒక్కసారైనా అయోధ్యను సందర్శించాలని భవిష్యత్ తరాలు బలంగా కోరుకులా అయోధ్యను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. నైపుణ్యవంతులైన యువత సేవలను నగరాభివృద్ధిలో ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి దిశగా మన దార్శనికతను అత్యుత్తుమ స్థాయిలో చాటేలా ఉండాలని సూచించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు.

    ప్రతి భారతీయుడిలో అంతర్లీనంగా ఉండే సాంస్కృతిక స్పృహను పుణికిపుచ్చుకున్న నగరం అయోధ్య అని.. అయోధ్య ఆధ్యాత్మిక నగరం మాత్రమే కాదని, ఆత్మ పరివేష్టితమైన నగరం అని చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో అయోధ్య ఎలా ఉండబోతోందన్న విషయం ప్రజల మనోభావాలతో సరిపోలాలని.. ఇది పర్యాటకులకు, భక్తులకు ఉపయుక్తంగా ఉండాలని మోదీ నిర్దేశించారు.

    ఉత్తర ప్రదేశ్ (యుపి) ప్రభుత్వ అధికారులు అయోధ్య అభివృద్ధికి సంబంధించి వివిధ అంశాలను ప్రెజెంట్ చేశారు. అయోధ్య అభివృద్ధిని ఆధ్యాత్మిక కేంద్రం, గ్లోబల్ టూరిజం హబ్ మరియు స్థిరమైన స్మార్ట్ సిటీగా రూపొందించబోతున్నారు. అయోధ్యతో కనెక్టివిటీని మెరుగుపరచడానికి వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి ప్రధానికి వివరించారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, రోడ్లు, హైవేలు వంటి వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రధాని చర్చించారు. రాబోయే గ్రీన్ ఫీల్డ్ టౌన్ షిప్ లో భక్తులకు బస సౌకర్యాలు, ఆశ్రమాలు, మఠాలు, హోటళ్ళు, వివిధ రాష్ట్రాల భవన్లు ఉన్నాయి. పర్యాటక సదుపాయాల కేంద్రం, ప్రపంచ స్థాయి మ్యూజియం కూడా నిర్మించనున్నారు.

    Trending Stories

    Related Stories