ఈ నెల 11, 12 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను ఎంపీ విజయసాయిరెడ్డి, జిల్లా అధికారులు పరిశీలించారు. సుమారుగా 65వేల నుంచి లక్ష మంది జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోదీ రూ.10,475 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు, ఉత్తరాంధ్రలో పలు కేంద్ర ప్రభుత్వ రోడ్లకు, గెయిల్ పైప్లైన్కు శంకుస్థాపనతో పాటు మొత్తం ఏడు కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమం రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదని.. ప్రభుత్వ కార్యక్రమం అని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.