More

    ప్రధాని మోదీ తెలుగురాష్ట్రాల టూర్

    ప్రధాని నరేంద్ర మోదీ రెండు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ విశాఖకు రానున్నారు. ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాళ మైదానంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. రూ.7,614 కోట్లతో చేపట్టనున్న ఐదు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.7619 కోట్లతో పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులకు ప్రధాని జాతికి అంకితం చేస్తారు.

    ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం 5.30గంటలకు మధురై విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం 7. 25గంటలకు విశాఖ ఎయిర్‎పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బై రోడ్ నేవీ అతిథిగృహం ఐఎన్ఎస్ చోళాకు బయలుదేరుతారు. మార్గమధ్యలో ఏడున్నర నుంచి 7.45 వరకూ కిలోమీటర్ మేర రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి ఎనిమిదింటికి చోళాకు చేరుకుంటారు. రాత్రి 8గంటల నుంచి 8.30 నిమిషాల వరకూ బీజేపీ కోర్ కమిటీ మీటింగ్లో పాల్గొంటారు. తర్వాత 10నిమిషాల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‎తో భేటీ అవుతారు. ఇక రాత్రి అక్కడే బస చేస్తారు. నవంబర్ 12న శనివారం ఉదయం 9 గంటల నుంచి తిరిగి ప్రధాని షెడ్యూల్ రీ స్టార్ట్ అవుతుంది. తొమ్మిదింటి నుంచి వీఐపీ అపాయింట్మెంట్స్ ఉంటాయి. తర్వాత బై హెలికాఫ్టర్ ద్వారా 10గంటల 10నిమిషాలకు ఏయూకి బయలుదేరుతారు. 10గంటల 25నిమిషాలకల్లా ఏయూకు చేరుకుంటారు. పదిన్నరకల్లా వేదిక దగ్గరకు చేరుకుంటారు. వేదికపై నుంచి వర్చువల్‎గా 9 ప్రాజెక్టులకు శంఖుస్థాపన, రెండు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేస్తారు. ఉదయం పదకొండున్నర నుంచి 11.45 గంటల వరకూ ప్రధాని ప్రసంగం ఉంటుంది. ఉదయం 11.45నిమిషాలకు విశాఖ ఎయిర్‎పోర్టుకు బయలు దేరుతారు. మధ్యాహ్నం 12గంటలకల్లా ఎయిర్‎పోర్టుకు చేరుకుంటారు. 12.05 నిమిషాలకు ప్రధాని తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం 1.10నిమిషాలకు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‎పోర్టులో ల్యాండవుతారు. అనంతరం రామగుండంలో ఎరువుల ప్రారంభోత్సవానికి వెళతారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు.

    మరోవైపు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించిన‌ట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బేగంపేట ఎయిర్‌పోర్టు ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌న్నారు. పంజాగుట్ట – గ్రీన్ ల్యాండ్స్ – ప్ర‌కాశ్ న‌గ‌ర్ టీ జంక్ష‌న్, ర‌సూల్‌పురా టీ జంక్ష‌న్, సీటీవో మార్గాల్లో వాహ‌నాల మ‌ళ్లింపు ఉంటుంద‌ని, ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల‌ని సూచించారు. సోమాజిగూడ‌, మోన‌ప్ప ఐలాండ్, రాజ్‌భ‌వ‌న్ రోడ్, ఖైర‌తాబాద్ జంక్ష‌న్ ప‌రిధిలో మ‌ధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. ఈ మార్గాల్లో ప్ర‌యాణించే వాహ‌న‌దారులు, ప్ర‌యాణికులు ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల‌ని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

    ప్రధాని మోడీ వైజాగ్ షెడ్యూల్ ఇలా..
    • శుక్రవారం రాత్రి 7. 25గంటలకు విశాఖ ఎయిర్‎పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బై రోడ్ నేవీ అతిథిగృహం ఐఎన్ఎస్ చోళాకు బయలుదేరుతారు.
    • మార్గమధ్యంలో ఏడున్నర నుంచి 7.45 వరకూ కిలోమీటర్ మేర రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి 8గంటలకు చోళాకు చేరుకుంటారు.
    • రాత్రి 8గంటల నుంచి ఎనిమిదిన్నర వరకూ బీజేపీ కోర్ కమిటీ మీటింగ్‎లో పాల్గొంటారు. తర్వాత 10నిమిషాల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‎తో భేటీ అవుతారు. ఇక రాత్రి 8.40 నుంచి పీఎం షెడ్యూల్ రిజర్వ్.
    • నవంబర్ 12న శనివారం ఉదయం 9 గంటల నుంచి తిరిగి ప్రధాని షెడ్యూల్ రీ స్టార్ట్ అవుతుంది. 9గంటల నుంచి వీఐపీ అపాయింట్మెంట్స్ ఉంటాయి.
    • 10గంటల 10నిమిషాలకు హెలికాఫ్టర్ ద్వారా ఏయూకి బయలుదేరుతారు. 10.25 నిమిషాలకల్లా ఏయూకు చేరుకుంటారు. పదిన్నరకల్లా వేదిక దగ్గరకు చేరుకుంటారు.
    • వేదికపై నుంచి వర్చువల్‎గా 9 ప్రాజెక్టులకు శంఖుస్థాపన, రెండు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేస్తారు. ఉదయం పదకొండున్నర నుంచి 11 గంటల నుంచి 11.45 వరకూ ప్రధాని ప్రసంగం.

    • ఉదయం 11.45నిమిషాలకు ఎయిర్ పోర్టుకు బయలు దేరుతారు. మధ్యాహ్నం 12గంటలకల్లా ఎయిర్‎పోర్టుకు చేరుకుంటారు.
    12.05 నిమిషాలకు ప్రధాని ప్రయాణించే ప్రత్యేక విమానం టేకాఫ్ తీస్కుంటుంది.
    మధ్యాహ్నం 1.10నిమిషాలకు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్టులో ల్యాండవుతారు.
    అనంతరం రామగుండంలో ఎరువుల ప్రారంభోత్సవానికి వెళ్లనున్నారు.
    అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు.

    Trending Stories

    Related Stories