Telugu States

రాజ్ భవన్ లో బస చేయనున్న ప్రధాని మోదీ

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ నెల 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మోదీ బహిరంగ సభ జరగనుంది. బహిరంగ సభ తర్వాత రాజ్ భవన్ లో మోదీ బస చేస్తారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మోదీ బస సందర్భంగా భద్రతారపమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. హెచ్ఐసీసీ, బేగంపేట్, రాజ్ భవన్ మార్గాల్లో 4 వేల మంది పోలీసులతో పరాహా నిర్వహిస్తామని తెలిపారు. పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో 3 వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారని చెప్పారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు సభకు హాజరవుతున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. డీఐజీ, ఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను ఇంఛార్జ్ లుగా నియమించామని చెప్పారు.

బీజేపీ నేతలతో కలసి పరేడ్ గ్రౌండ్స్ లో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. జడ్, జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉన్న నాయకులు వస్తోన్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశామని సీవీ ఆనంద్ తెలిపారు.

ఇక పరేడ్ గ్రౌండ్స్ లో లక్షమంది వరకు కూర్చునే అవకాశం ఉంది. సభకు ప్రధాని మోదీ సహా.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉంది. కంటోన్మెంట్, జీహెచ్ఎంసీ అధికారులు పార్కింగ్ స్థలాలు కేటాయించారు. ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఇతర జిల్లాల నుంచి అధికారులను పిలిపించారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 3వేల మందితో పహారా ఏర్పాటు చేశారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్, తెలంగాణ పోలీసులు బందోబస్త్ లో ఉండనున్నారు. డీఐజీ, ఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను సెక్టర్ ఇంఛార్జ్ లుగా నియమించారు.

Related Articles

Back to top button