More

    రామగుండంలో కాక రేపుతున్న ప్రధాని మోదీ రాక..!

    ప్రధాని మోదీ రామగుండం పర్యటనకు సర్వం సిద్దమైంది. రామగుండం ఎరువుల కర్మాగారం, భద్రాచలం-సత్తుపల్లి రైల్వేలైన్‎ను జాతికి అంకితం చేయడంతో పాటు..రూ.9500 కోట్ల రూపాయలకు పైగా విలువకలిగిన పలు ప్రాజెక్టులకు రామగుండంలో శంకుస్థాపన చేయనున్నారు. రామగుండం ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన తర్వాత బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ఇందుకోసం ఎన్టీపీసీ టౌన్‎షిష్‎లోని క్రీడా మైదానం ముస్తాబైంది. మరోవైపు ప్రధాని మోదీ రాకపై కామ్రేడ్స్ కన్నెర్రజేస్తున్నారు. ఇప్పటికే పలు కార్మిక సంఘాలు గో బ్యాక్ అంటు నిరసన బాటపట్టాయి. రామగుండం బంద్‎కు వామపక్షాలు పిలుపునిచ్చాయి. కార్మిక చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, సింగరేణి బావుల ప్రైవేటీకరణపై మండిపడుతున్నారు. మోదీ పర్యటనను అడ్డుకుంటామని కార్మిక సంఘాలు, వామపక్షాలు స్పష్టం చేయడంతో రామగుండం చూట్టు భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి.

    Trending Stories

    Related Stories